నందిని నర్సింగ్ హోమ్ మూవీ రివ్యూ….

0
585
nandini nursing home movie review

 Posted [relativedate]

nandini nursing home movie reviewచిత్రం : నందిని నర్సింగ్ హోమ్ (2016)
న‌టీన‌టులు : న‌వీన్ విజ‌య్ కృష్ణ‌, శ్రావ్య‌, నిత్యా నరేష్
సంగీతం: అచ్చు
దర్శకత్వం : పి.వి.గిరి
నిర్మాతలు: రాధాకిషోర్‌.జి, బిక్షమయ్య సంగం
రిలీజ్ డేట్ : 21 అక్టోబర్, 2016.

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా తెరంగేట్రం చేసిన మహేష్ బాబు ఇప్పటికే టాలీవుడ్ ని ఏలుతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ రాణిస్తున్నాడు. ఇప్పుడు కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడంటే.. సాధారణంగా ఆ హీరోపై అంచనాలు పెరిగిపోవడం సాధారణమే. “నందిని న‌ర్సింగ్ హోం”తో పరిచయం తెరగేట్రం చేస్తోన్న సీనియర్ నరేష్ తనయుడు న‌వీన్ విజ‌య కృష్ణ‌ విషయంలోనూ అదే జరిగింది. పి.వి గిరి దర్శకత్వంలో నవీన్ విజయ్ కృష్ణ-శ్రావ్య జంటగా నటించిన చిత్రం “నందిని న‌ర్సింగ్ హోం”. ఈ చిత్రానికి ప్రిన్స్ మహేష్ మద్దతు లబించింది. ఈ చిత్ర ఆడియోకి చీఫ్ గెస్ట్ మహేష్ విచ్చేసి.. సినిమాని ప్రమోట్ చేశాడు. దీంతో.. మహేష్ ఫ్యాన్స్ ‘నందిని నర్సింగ్ హోం’ని తమ చిత్రంగా భావిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. హీరోగా నవీన్ విజయ్ కృష్ణ మంచి మార్కులు కొట్టేశాడా.. ? ‘నందిని న‌ర్సింగ్ హోం’ కథేంటో.. ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

క‌థ‌ :
చంద్ర‌శేఖ‌ర్ అలియాజ్ చందూ (న‌వీన్ విజ‌య కృష్ణ‌).. విశాఖ‌లోని ఒక బ్యాంక్ లో రిక‌వ‌రి సేల్స్ మెన్ ఉద్యోగి. అత‌ను ఉంటున్న ఇంటి ప‌క్క‌నే గ‌ర్ల్ హాస్ట‌ల్లో అమూల్య‌ (శ్రావ్య‌)పై మనసుపడతాడు. అమూల్యకి డబ్బంటే ఇష్టం. డ‌బ్బే అమెకు లోకం. అయితే, చంద్ర‌శేఖ‌ర్ లో నిజాయితీ చూసి ప్రేమ‌లో ప‌డుతుంది. ప్రేయసి, తనుకి అత్యంత ఇష్టమైన డబ్బుని ఇంకా ఎక్కువ మొత్తంలో సంపాదించేందుకు హైదరాబాద్ లో అడుగుపెడతాడు చందూ. అనుకోకుండా సిటీలోనే పెద్ద హాస్పిటల్స్‌లో ఒకటైన నందిని నర్సింగ్ హోమ్‌లో డాక్టర్‌గా ఉద్యోగం వస్తుంది. డాక్టర్ అవ్వడానికి తనవద్ద ఏ అర్హతా లేకున్నా, దొంగ డాక్టర్‌గా ఆ ఉద్యోగంలో చేరతాడు. నందిని నర్సింగ్ హోమ్‌ కూతురు నందిని చందూని మొదటి చూపులోనే పడిపోతుంది. అప్పటికే నర్సింగ్ హోమ్‌లో భయానక సంఘటనలు జరుగుతుంటాయి. చందు అక్కడ చేరాక ఈ సంఘటనలు మరింత పెరిగిపోతాయి. నందిని నర్సింగ్ హోమ్‌ ని దెబ్బతీయాలనుకునే వారు ఎవరు ? వాటిని  చందూ ఎలా కనిపెట్టాడు… ?? చందూతో అమూల్య, నందినిల ప్రేమకథలు ఏమయ్యాయి. అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
* కామెడీ
* సస్పెన్స్
* సప్తగిరి
* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
* స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
‘నందిని నర్సింగ్ హోమ్’.. ఇక్కడ అస్సలు బోర్ అనేదే ఉండదు. ఎందుకంటే.. కమర్షియల్ కామెడీ కథకి ఓ సస్పెన్స్ ని కూడా యాడ్ చేసి.. దానిని చివరి
వరకు రిలీఫ్ చేయకుండా ఉంచడంలో దర్శకుడు పి.వి గిరి సక్సెస్ అయ్యాడు. సప్తగిరి, శకశక శంకర్, వెన్నెల కిషోర్ లని ఫర్ ఫెక్ట్ గా ఉపయోగించుకొన్నాడు. వీరు చేసే కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వడం ఖాయం. ఇక, హీరోగా తొలి చిత్రమే అయినా.. సెటిల్డ్ గా కనిపించాడు నవీన్ విజయ్ కృష్ణ. ఈ చిత్రం నివిడిని ఇంకాస్ట తగ్గించి.. ఒకట్రెండు మార్పులు చేస్తుంటే ఫలితం మరో రేంజ్ లో ఉండేది. కథానాయికలు శ్రావ్య, నిత్యా నరేష్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. ప్రత్యేకంగా కథకి ఏమాత్రం ఇబ్బంది కలకుండా దర్శకుడు రాసుకొన్న కామెడీ ట్రాక్ సినిమాని నిలబెట్టింది.

సాంకేతికంగా :
పి.వి. గిరి స్క్రీన్ ప్లే బాగుంది. కార్పొరేట్ ఆసుప‌త్రిలో జ‌రుగుతున్న అన్యాయాల‌ను చూపిస్తూనే, మ‌రోవైపు క‌న్న పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రుల మ‌మ‌కారాన్ని హృద‌యాల‌కు హ‌త్తుకునేలా చూపాడు. తీసిన ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులకి చూపించాలన్న ఆతృత దర్శకుడిలో కనిపించింది. దీంతో.. సినిమా నివిడి ఎక్కువైంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకొన్ని సన్నివేశాలకి కత్తెరపెట్టవచ్చు. అచ్చు అందించిన పాటలు బాగున్నాయి. తెరపై చూడ్డానికి ఒకట్రెండు పాటలు ఇంకా బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
ఎలాంటి లాజిక్కులు, మేజిక్కులు ఆశించకుండా.. కాసేపు హాయిగా నవ్వుకొనేందుకు ‘నందిని నర్సింగ్ హోమ్’కి వెళ్లవచ్చు. కాకపోతే కాస్త ఓపిగా కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే.. ఈ సినిమా నివిడి కాస్త ఎక్కువే.

చివరగా : నందిని నర్సింగ్ హోమ్.. ఇది కామెడీ నర్సింగ్ హోమ్
రేటింగ్ : 2.75/5

Leave a Reply