టీడీపీకి నంద్యాల తలపోటు

0
616
nandyala seat headache to tdp

Posted [relativedate]

nandyala seat headache to tdpభూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉపఎన్నిక అనివార్యమైంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ సీటులో టీడీపీ విజయం నల్లేరుపై నడక కావాలి. కానీ పార్టీ అంతర్గత విభేదాలతో చంద్రబాబు టికెట్ ఎవరికి ఇవ్వారో తేల్చుకోలేకపోతున్నారు. న్యాయం ప్రకారం తన కుటుంబానికే టికెట్ ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ గట్టిగా వాదిస్తున్నారు. అటు 2014లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన శిల్పా కూడా టికెట్ తనకే రావాలని పంతం పట్టారు. అదేమంటే క్యాడర్ పోతుందని, వాళ్లు పోతే మళ్లీ కూడగట్టుకోవడం జరిగే పని కాదనేది ఆయన బాథ.

రెండు వర్గాలు కలిసి చంద్రబాబు అల్టిమేటమ్ లు ఇస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నాయి. ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్న చంద్రబాబు.. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. శిల్పా మోహన్ రెడ్డి సీటు కోసం పట్టుబట్టడం ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డికే నచ్చడం లేదన్నది ఇన్ సైట్ టాక్. శిల్పా మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో తాను కష్టపడి పనిచేశానని, ఇప్పుడు తాను ఎమ్మెల్సీ అయి, త్వరలో మండలి ఛైర్మన్ గా ఎన్నిక కాబోతుండగా.. శిల్పా రచ్చచేయడం సరికాదనేది చక్రపాణి వాదన.

సరిగ్గా ఈ వాదనే హైలైట్ చేసి శిల్పాను ఇరుకునపెట్టాలని బాబు యాక్షన్ ప్లాన్. చనిపోయిన కుటుంబానికి టికెట్ ఇవ్వడం ఉమ్మడి రాష్ట్రం నుంచి పాటిస్తున్న ఆనవాయితీ. దేశవ్యాప్తంగా కూడా ఇదే సంప్రదాయం ఉంది. ఒక్క నంద్యాలలో శిల్పా కోసం దీన్ని మార్చలేమనేది టీడీపీ అభిప్రాయం. పైగా శిల్పా పోటీచేసినా గెలుస్తారనే గ్యారెంటీ లేదని, అదే అఖిలప్రియ కుటుంబమైతే టీడీపీలో అన్నివర్గాలు కలిసి పనిచేస్తాయని కూడా అధిష్ఠానానికి నివేదికలు అందాయి. దీంతో త్వరలోనే అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డికి సీటు ఖాయమయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply