‘నానికి సెటప్’ సెట్ చేసిన అవసరాల !

 Posted October 22, 2016

nani avasarala srinivas movie heroine regina

నటుడిగా రాణిస్తూనే దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకొన్నాడు అవసరాల శ్రీనివాస్.ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్చుతానంద లతో వరుసగా రెండు హిట్లని తన ఖాతాలో వేసుకొన్నాడు.హ్యాట్రిక్ హిట్ కోసం నానితో జతకట్టనున్నాడు. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ ని పూర్తి చేసిన అవసరాల.ప్రస్తుతం నటీనటుల ఎంపికపై ఫోకస్ చేశాడు. 

తాజాగా, నానికి జంటగా రెజీనాని ఫైనల్ చేశాడు. ‘జ్యో అచ్చుతానంద’ రెజీనా నటనని చూసిన అవసరాల..ఆమెకి మరో అవకాశం ఇచ్చాడు.నానికి హీరోయిన్ గా సెట్ చేశాడు. ప్రస్తుతం నాని ‘నేను లోకల్’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత అవసరాల సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. నాని చిత్రంలో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఆశపడుతున్న అవసరాల అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకొంటున్నాడు.

SHARE