నాని ఉగాది రోజు నాన్న అయ్యాడు..

nani became dad on ugadi
    నాచురల్ స్టార్ నాని కి,ఆయన కుటుంబానికి ఒక్క రోజే రెండు పండగలు వచ్చాయి.ఉగాది రోజే నాని భార్య అంజన పండంటి మగబిడ్డకి జన్మ ఇచ్చింది.దీంతో ఆ ఇంట పండగ సంబరం రెట్టింపు అయ్యింది.నాని,అంజనా సంతోషానికి అవధుల్లేవు.అసలు నాని ఆర్జే గా పని చేస్తున్నప్పుడే అంజనా తో పరిచయం ఏర్పడింది.ఆయన సినిమా హీరోగా మారినా ఆ బంధం అలాగే కొనసాగింది.రెండు వైపులా కుటుంబాల ఆమోదంతో ఆ ఇద్దరూ 2012 లో ఓ ఇంటివారయ్యారు.పెళ్ళైన ఐదేళ్లకి ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు.

SHARE