ఇక, నాని మేల్కోవాల్సిందే !

nani choose story oriented movieస్టార్ ఇమేజ్ రావడం ఒకెత్తు.దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు.ఎంత పెద్ద స్టార్ అయినా కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు ఎంత నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. ఆ అనుభవం ఎలాగుంటోంది స్టార్ హీరోలు రజనీ, చిరంజీవి,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. అనుభవించినవారే. స్టార్ ఇమేజ్ వచ్చింది కదా.. కాస్త నివ్వెరపాటుగా ఉంటే అసలుకే ఎసరు రావడం ఖాయం.

‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో నాని రేంజ్ పెరిగిపోయింది.అయితే,ఆ ప్రభావం తర్వాత సినిమాలు కృష్ణగాడి వీర ప్రేమ గాధ,మజ్ను ల కనిపించింది.అయితే,  ఈ రెండు సినిమాలని పరిశీలిస్తే.. కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటె చాలు తన ఇమేజ్ తో బండి నడిపెయోచ్చు అని నాని భావిస్తున్నట్టు కనిపించింది.ఓవర్సీస్ లోనూ నాని రేంజ్ పెరిగిపోయింది.అయితే,మజ్ను ఓపెనింగ్స్ దగ్గర పాస్ అయ్యింది.కానీ,ఆ చిత్రం ఓవర్సీస్ హక్కులని 3.2 కోట్లకు కొన్న బయ్యర్ ఫైనల్ గా 1.4 కోట్లు మాత్రం రిటర్న్ వచ్చాయి. ఈ లెక్కన ‘మజ్ను’డిజాస్టర్ కిందే లెక్క. ఈ డేంజర్ సిగ్నల్ నాని గమనిస్తే మంచింది. కథలో ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ఉంటే చాలదు. కథలో బలం ఉండాలన్నది నాని ఎప్పుడు గ్రహిస్తాడో.. చూడాలి.

SHARE