నాని రేటు,రేంజ్ పెరిగినట్టే..

Posted April 7, 2017

nani increase his remuneration to next movie
సినిమా రంగంలో హిట్లు,సూపర్ హిట్లు మాత్రమే ఓ స్టార్ రేంజ్ ని డిసైడ్ చేస్తాయని కొందరిలో ఓ అపోహ వుంది.కానీ నిజానికి వాటి కన్నా ఓ యావరేజ్,ప్లాప్ సినిమాకి వచ్చే కలెక్షన్స్ మాత్రమే ఓ నటుడికున్న స్టార్ రేంజ్ ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఆ లెవెల్ కి వచ్చేసినట్టే కనిపిస్తోంది.ఎందుకంటే నాని రేటు 3 నుంచి 5 కోట్లకి పెరిగిందట.అలా ఒక్కసారిగా ఇంత పెంచడానికి కారణం కనుక్కుంటే ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది.

నాని కెరీర్ లో అనూహ్య విజయం సాధించిన సినిమా భలే భలే మగాడివోయ్.ఆ సినిమా ప్లాప్స్ నుంచి నాని కేరీర్ ను హిట్ బాట పట్టించడమే కాదు…నాని సినిమా ఇంత కలెక్ట్ చేస్తుందా అని ఇండస్ట్రీ వర్గాల్ని ముక్కున వేలేసుకునేలా చేసిన సినిమా.ఆ తర్వాత కూడా నాని హిట్ సినిమాలు వచ్చినా రేటు గురించి పెద్దగా ఆలోచించలేదు.చివరకు నేను లోకల్ సినిమా కాస్త రొటీన్ సినిమా ,డివైడ్ టాక్ తో నడిచింది.అయినా కలెక్షన్స్ బాగానే ఉండటంతో రేటు పెంచొచ్చని నాని డిసైడ్ అయ్యాడు.ఒకేసారి 3 నుంచి 5 కోట్లకు పెంచినా నిర్మాతలు నాని విషయంలో నో ప్రాబ్లెమ్ అనుకుంటూ ముందుకొస్తున్నారు.

SHARE