‘నేను లోకల్’.. ఎప్పుడంటే ?

 Posted October 28, 2016

nani nenu local movie first lookనాచురల్ స్టార్ నాని జోరుమీదున్నాడు.’ఎవడే సుబ్రమణ్యం’ నుంచి ‘మజ్ను’ వరకు వరుసగా ఐదు హిట్స్ తన ఖాతాలో వేసుకొన్నాడు.మినిమం గ్యారెంట్ హీరోగా ఎదిగాడు.ఇప్పుడు నాని సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటుగా..ఓవర్సీస్ జనాలు కూడా ఎదురు చూస్తున్నారు.

దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతోన్న నాని తాజా చిత్రం’నేను లోకల్’.త్రినాథరావు దర్శకుడు.ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ జతకట్టనుంది. జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోపు దీపావళి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. నాని స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ పక్కా లోకల్ కుర్రాడిలా కనిపిస్తున్న పిక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు.’ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘నేను లోకల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై మీరు ఓ లుక్కేయండీ.. 

SHARE