జులై11న “నిన్ను కోరి”

0
524
nani ninnu kori movie release date details

Posted [relativedate]

nani ninnu kori movie release date detailsకృష్ణగాడి వీర ప్రేమగాధ, మజ్ను, జెంటిల్ మన్ వంటి వరుస హిట్స్ తో స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చుకున్నాడు నాని. ఇక ఇటీవల విడుదలైన నేను లోకల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో నెక్ట్స్ సినిమా “నిన్నుకోరి”  మూవీని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్.

శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో  నాని సరసన  నివేథా థామస్‌ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నాడు. రీసెంట్‌ గా అమెరికా షెడ్యూల్ ని పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం వైజాగ్‌ లో  చిత్రీక‌ర‌ణ‌ చేస్తోంది చిత్రయూనిట్. ఈ  వైజాగ్ షెడ్యూల్‌ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందట. దీంతో  ఈ సినిమాను జూలై 11న విడుద‌ల చేయ‌డానికి దర్శకనిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.  సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. మరి వరుస హిట్స్ కొడుతున్న నాని ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

Leave a Reply