Saturday, September 18, 2021
HomeEntertainmentCinema Latestనిన్నుకోరి’ కథ ఇదే.. ఎప్పుడో చూసినట్లుందే

నిన్నుకోరి’ కథ ఇదే.. ఎప్పుడో చూసినట్లుందే

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సహజనటుడిగా పేరు తెచ్చుకున్న నాని తాజాగా ‘నేను లోకల్‌’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘నిన్నుకోరి’ అనే చిత్రాన్ని నాని చేస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని ‘నిన్నుకోరి’ చిత్రంతో మరో సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా, ఒక విభిన్న ప్రేమ కథతో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ కథ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘నిన్నుకోరి’ కథ.. నాని, నివేధ థామస్‌లు ప్రేమించుకుంటారు. కొన్ని కారణాల వల్ల నానిని అపార్థం చేసుకుని అతడి నుండి విడిపోతుంది. నాని నుండి విడిపోయిన నివేద థామస్‌కు ఆమె కుటుంబ సభ్యులు ఆదితో పెళ్లి కుదుర్చుతారు. ఆదితో నివేద ట్రావెల్‌ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలోనే నాని కూడా కొన్ని కారణాల వల్ల వారితో ఉంటాడు. ఆదికి నివేద తన లవర్‌ అని చెప్పకుండా నాని తన ప్రేమ కథను చెప్తాడు. ఆ ప్రేమ కథతో బాగా కనెక్ట్‌ అయిన ఆదికి తను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయినే నాని ప్రేమించాడు అని చివరకు తెలుస్తుంది. అప్పుడు ఆది ఎలా రియాక్ట్‌ అవుతాడు, నాని ప్రేమను మళ్లీ నివేదా అర్థం చేసుకుంటుందా, ప్రేమను నాని ఎలా దక్కించుకున్నాడు. ఈ కథతో మంచి ఎంటర్‌టైనర్‌మెంట్‌తో సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కథ ఎప్పుడో ఏదో సినిమాలో చూసినట్లుగా అనిపిస్తుంది. కథ కాస్త పాతదే అయినా చూపించే తీరు కొత్తగా ఉంటుందని అంటున్నారు.

- Advertisment -
spot_img

Most Popular