Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాచురల్ స్టార్ నాని సరికొత్త సినిమా ‘ నిన్నుకోరి’ టీజర్ ఈరోజు విడుదల అయ్యింది. డీవీవీ దానయ్య, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు. ఇక ఎప్పటిలాగానే టీజర్ తోనే నాని తన సినిమా మీద ఇంటరెస్ట్ క్రియేట్ చేయగలిగాడు. జెంటిల్ మెన్ లో నానికి జంటగా చేసి అదరగొట్టిన నివేద థామస్ ఇందులో హీరోయిన్. ” ఈ అమ్మాయిలు కూడా అసలు అర్ధం కారు బాస్. అన్ని అలవాట్లు వున్నవారిని ప్రేమిస్తారు. ఏ అలవాట్లు లేని వారిని పెళ్లి చేసుకుంటారు”… అంటూ నాని చెప్పిన డైలాగు కి భారీ రెస్పాన్స్ వచ్చేలా వుంది. పెళ్ళైన ప్రియురాలిని భర్త దగ్గర ఒప్పించి మరీ వెనక్కి తీసుకొచ్చే ప్రియుడు కథ ” నిన్ను కోరి ” అని ప్రచారంలో వుంది. ఇందులో నిజానిజాలు ఏమిటో సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు.