నాని కామెంట్ ‘త్వరలోనే ఇండియా విడుదల’..!

Posted November 9, 2016

nan11నరేంద్ర మోది సడెన్ గా ప్రవేశ పెట్టిన 500, 1000 రూపాయల నోట్ల రద్దు కార్యక్రమానికి గంట గంటకు సపోర్ట్ పెరిగిపోతుంది. మోది ఆ ప్రకటన ఇచ్చిన కొద్ది సేపటికే అల్లు అర్జున్ తనదైన శైలిలో స్పందించడం జరిగింది. ఇక ఇప్పుడు అదే దారిలో సినిమా వాళ్లంతా మోది నిర్ణయానికి తమ అభినందనలు తెలియ చేస్తున్నారు. వారిలో నాని తన సినిమా లాంగ్వేజ్ లో 1947లో గాంధీగారు కొబ్బరి కాయ కొట్టారు.. 2016లో మోది గుమ్మడి కాయ కొట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రోసెస్ లో ఉంది త్వరలోనే ఇండియా విడుదల.. అంటూ సినిమాటిక్ గానే నల్లధనం నుండి మన దేశం విముక్తి కలుగుతుందని ట్వీట్ చేశాడు.

అయితే మోది తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సగానికి పైగా శభాష్ అనేలా చేస్తున్నా కొందరు మాత్రం సడెన్ గా ఇంత పెద్ద డెశిషన్ తీసుకోవడం వల్ల సగటు మనిషి నానా అవస్థలకు గురవుతున్నారని అంటున్నారు. ఇప్పటికే తమ వద్ద నున్న 500, 1000 రూపాయల నోట్లు ఎక్కడ చెల్లుబాటు అవుతాయా అని రోడ్లెక్కి తిరుగుతున్నారు జనాలు. ఈ ప్రభావం ఇంతలా ఉండటానికి కారణం బ్యాంకులు, ఏ.టి.ఏం లు కూడా బంద్ ఉండటమే అని తెలుస్తుంది. ఏది ఏమైనా మోది ప్రవేశ పెట్టిన ఈ నల్లధన నిర్మూలన చర్యలో భాగంగా మొదటి స్టెప్ అదరగొట్టేసిందని చెప్పాలి.

SHARE