పదేళ్ల తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ ?

0
550
nani says content movies and heroes always superstar

Posted [relativedate]

nani says content movies and heroes always superstar
సినిమా రంగంలోఈ శుక్రవారానికి వచ్చే శుక్రవారానికి లెక్కలు మారిపోతాయి.అలాంటిది ఓ పదేళ్ల తర్వాత టాలీవుడ్ లో సూపర్ స్టార్ ఎవరంటే చెప్పడం కష్టమే.కానీ నేచురల్ స్టార్ నాని ఆ విషయం లో ఓ అంచనాకి వచ్చాడు.పదేళ్ల తర్వాత టాలీవుడ్ లో కంటెంట్ మాత్రమే సూపర్ స్టార్ అవుతుందని …విషయం,కొత్తదనం వున్న సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారని నాని చెప్పాడు.ఇక విషయం,కొత్తదనం ఎవరి సినిమాల్లో ఉంటే వారే స్టార్స్ గా నిలబడతారని వివరించాడు.ఇక సినిమా రంగానికి సంబంధించి ఇంకో మార్పుని కూడా ఆయన కోరుకుంటున్నాడు.

టాలీవుడ్ లో సినిమా యూనిట్ లో స్టార్స్ ని ఒక రకంగా ,మిగిలిన వారిని ఇంకో రకంగా చూస్తున్నారని ఆ పద్ధతి మారాలని నాని అభిలషించారు.మళయాళ పరిశ్రమలో ఓ సినిమా చేస్తుంటే సూపర్ స్టార్ మోహన్ లాల్,లైట్ బాయ్ సహపంక్తి భోజనం చేస్తారని …ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొనాలని నాని అభిప్రాయపడ్డారు.ఇక ఇక్కడున్న ఇంకో సంస్కృతి గురించి …అదే హీరోలని బాబు అని పిలవడం గురించి కూడా నాని మొహమాటం లేకుండా నోరు విప్పాడు.ఒకప్పుడు హీరోల పిల్లలని సెట్ కి వస్తే బాబు అని పిలిచేవారు …ఆ తర్వాత వాళ్ళు హీరోలు కావడంతో అదే పిలుపు అలవాటు అయిపోయిందని నాని చెప్పాడు .తనను ఎవరు బాబు అని పిలిచినా ఊరుకోబోనని చెప్పారు.బాపు గారి దగ్గర అసిస్టెంట్ గా చేరినప్పుడు వ్యక్తుల కన్నా సినిమా గొప్పదన్న విషయం తెలుసుకున్నానని …జీవితాంతం దాన్నే పాటిస్తానని నాని వివరించాడు.ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ లోని మోస్ట్ ప్రామిసింగ్ నటులు,హీరోల్లో ఒకరిగా ఎదిగినా మూలాలు మరిచిపోని నేచురల్ స్టార్ నిరాడంబరత,సింప్లిసిటీ ని మెచ్చుకోవాల్సిందే.

Leave a Reply