భలేభలే మగాడివోయ్ ,జెంటిల్ మ్యాన్ ..సినిమాలతో భారీ విజయాలు అందుకున్న నాని మరో వెరైటీ కాంబినేషన్ కి సై అన్నాడు .ఈసారి ఆయన క్లాస్ నిర్మాత దిల్ రాజు కి సినిమా చేయబోతున్నాడు .ఈ ఫిలిం కి సినిమా సూపిస్త మావ వంటి చిత్రం తీసిన మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు .ఈ ఇద్దరి మధ్య నాని అనగానే ఆసక్తి పుడుతోంది .అందుకు తగ్గట్టే సినిమా కూడా వుంటుందట .
ప్రస్తుతం ఉయ్యాలజంపాల ఫేమ్ డైరెక్టర్ విరించి దర్శకత్వంలో నాని ఓ సినిమా తీస్తున్నాడు .ఆ పని పూర్తి కాగానే కొత్త సినిమా పని మొదలు అవుతుందట .