Posted [relativedate]
చిత్రం : నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
నటీనటులు : హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్
సంగీతం : శేఖర్ చంద్ర
దర్శకత్వం : బాస్కర్ బండి
నిర్మాత : బెక్కెం వేణు గోపాల్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్, 2016.
హెబ్బా పటేల్.. ఈ పేరు వింటేనే యూత్ హీటెక్కిపోతోంది. ‘కుమార్ 21ఎఫ్’తో యూత్ మతిపోగొట్టింది హెబ్బా. ఈ చిత్రంలో కుమారిగా హాట్ హాట్ గా కనిపిస్తూనే మంచి నటన కనబర్చింది. కుమారిగా యూత్ లో ఫుల్ క్రేజ్ కొట్టేసింది. ఈ చిత్రం తర్వాత హెబ్బా చేసిన ‘ఈడో రకం ఆడో రకం’, ఎక్కడికిపోతావు చిన్నివాడా చిత్రాలు కూడా హిట్ లిస్టులో చేరిపోయాయి. దీంతో.. ఆమె తాజా చిత్రం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’పై భారీ అంచనాలు
నెలకొన్నాయి.
భాస్కర్ బండి దర్శకత్వంలో హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులని ఆకట్టుకోవడం గ్యారెంటీ అని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరీ.. నాన్న ముందు హెబ్బా ఓ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ని ఉంచడం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది.. ? అసలు సినిమా అసలు కథేంటీ.. ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
పద్మావతి (హెబ్బా పటేల్) చదువు పూర్తి చేసుకొని.. ఉద్యోగం కోసం సిటీకి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ముగ్గురిని అబ్బాయిల్ని గోకుల్ (నోయెల్), నాని (అశ్విన్), నమో (పార్వతీశం) ప్రేమిస్తుంది. ఈ ముగ్గురు కూడా పద్మావతిని గాఢంగా ప్రేమిస్తారు. పద్మావతి ప్రేమని ఆమె తండ్రి రావు రమేష్ ఎలా అర్థం చేసుకొన్నాడు. చివరికి పద్మావతి ముగ్గురిలో ఎవరుని పెళ్లాడింది అనేది సెంటిమెంట్, కామెడీని మేళమించి చెప్పినదే మిగితా కథ. మధ్యలో జదర్థస్త్ టీం కామెడీ, తండ్రి పాత్రలో రావు రమేష్ ఎమోషనల్ సీన్స్ జోడించిన ప్రేమకథా చిత్రమిది.
ప్లస్ పాయింట్స్ :
* రావు రమేష్
* హెబ్బా పటేల్
* సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
* స్ర్కీన్ ప్లే
* కామెడీ టైమింగ్
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించడం అనేది విపరీతమైన పాయింట్. ఈ పాయింట్ చుట్టూ రాదుకొన్న కథకి కాస్త బోల్డ్ నెస్ ని టచ్ కావడం కామన్. ఇలాంటి పాయింట్ కి మళ్లీ ఫాదర్ సెంటిమెంట్ ని కనెక్ట్ చేయడం సాహాసమే. అయితే, ఈ సాహసంలో ఎలాంటి బోడ్ నెస్ టచ్ కాకుండ జాగ్రత్త పడ్డారు రచయితబి.సాయి కృష్ణ, దర్శకుడు భాస్కర్ బండి. కూతురిగా హెబ్బా పటేల్, తండ్రిగా రావు రమేష్ పాత్రలు ప్రేక్షకుడి మైండ్ లో రిజిస్టర్ అయిపోతాయి. వీరిద్దరి
నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. అమ్మాయిని ప్రేమించే కుర్రాళ్లుగా నటించిన నోయెల్, అశ్విన్, పార్వతీశం లు నటనతో ఫర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించారు.
సాంకేతికంగా :
ప్రేమ కథను సరికొత్తగా చెప్పడంలో దర్శకుడు బాస్కర్ బండి సక్సెస్ అయ్యాడు.తండ్రి-కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. చోటా కె నాయుడుసినిమాటోగ్రఫీ సూపర్భ్. టెక్నికల్ గా సినిమా స్థాయిని పెంచేసింది.సంగీతం, నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి. ‘ఒక పారు ముగ్గురుదేవదాసులు..’ తెరపై చూడ్డానికి ఇంకా బాగుంది. హీరోయిన్ ముగ్గురు అబ్బాయిలతో ప్రేమలో పడే సన్నివేశాలు సిల్లీగా ఉన్నాయి. అమ్మాయిని
ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు చేసే పనులు కూడా తేలిపోయాయి. ఇలాంటి కొన్ని సీన్స్ కి కత్తెరపెడితే బాగుండేది.
తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’.. కాస్త కొత్తగా, కొంచెం ఎమోషనల్ గా ఉంది. కొంచెం కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు హెబ్బా ఫాదర్ సెంటిమెంట్.. ఆమె బాయ్ ఫ్రెండ్స్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు.
బాటమ్ లైన్ :
‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’.. ఎమోషనల్ & రొమాంటిక్
రేటింగ్ : 2.75/5