బ్రాహ్మణికి నో ఇంటరెస్ట్..లోకేష్ కి ఒకే ఒక్క కోరిక

0
527
nara brahmani says iam not interested to politics and said about lokesh wish

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

nara brahmani says iam not interested to politics and said about lokesh wish
చంద్రబాబు వారసుడు నారా లోకేష్ అని తేలిపోయినప్పటినుంచి ఆయన సామర్ధ్యం మీద అంతటా చర్చ సాగుతోంది.అయన కన్నా బ్రాహ్మణి అయితే బాగుంటుందని కొందరు వాదిస్తున్నారు. వారి లెక్క ప్రకారం నందమూరి ఆడబిడ్డ,నారా వారి కోడలు కావడం ఆమెకున్న అదనపు అర్హత అంటున్నారు.ఆమె వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయొచ్చని కూడా ప్రచారం అవుతోంది.అయితే ఆ ప్రచారానికి బ్రేక్ వేస్తూ బ్రాహ్మణి తనకు పాలిటిక్స్ లో ఆసక్తి లేదని, వ్యాపారానికి పరిమితం అవుతానని తేల్చి చెప్పారు.హెరిటేజ్ ఫుడ్స్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగిన కార్యక్రమంలో బ్రాహ్మణి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు.

ఇక ఇటీవలే మంత్రివర్గంలో చేరి బాబు వారసత్వాన్ని అందుకోడానికి ట్రైనింగ్ అవుతున్న నారా లోకేష్ పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి దినోత్సవం సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.సీఎం పీఠం ముళ్లకిరీటం వంటిదని లోకేష్ అభిప్రాయపడ్డారు.ఓ వైపు ఈ మాట అంటూనే తన తండ్రిని ఒకే ఒక్క కోరిక కోరినట్టు వెల్లడించారు.అది కూడా మంత్రివర్గంలోకి తనని తీసుకుంటున్నట్టు చెప్పగానే పంచాయితీ రాజ్ శాఖ కేటాయించామని కోరాడట.పల్లెకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే అని లోకేష్ అన్నారు.మొత్తానికి బాబు కొడుకుకోడలు కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.ఆ కామెంట్స్ మీద వారు ఎంత కాలం నిలబడతారో చూద్దాం.

Leave a Reply