Posted [relativedate]
వంశానికొక్కడు..బాలయ్య హీరోగా దాదాపు 20 ఏళ్ల కిందట వచ్చిన సినిమా.తన కుటుంబం వల్ల నష్టపోయిన ఓ కుటుంబానికి కథానాయకుడు దత్తత వెళ్లడం ఆ సినిమా కథ.ఇటీవల మాచర్ల మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి ఆత్మహత్య,అంతకుముందు ఆమె భర్త గుండెపోటుతో మరణించారు.అందుకు దేశం అంతర్గత కలహాలే కారణమని వైసీపీ విమర్శిస్తోంది.శ్రీదేవి సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు జరిగిన విషాదాన్ని వాడుకోడానికి ప్రయత్నిస్తోంది.అయితే శ్రీదేవి ఆత్మహత్యకి వ్యక్తిగత కారణాలే తప్ప పార్టీకి సంబంధం లేదని దేశం నేతలు వాదిస్తున్నారు.కారణమేదైనా చనిపోయిన దంపతుల ఏడేళ్ల కుమారుడు మాత్రం అనాథగా మిగిలిపోయాడు.
మొత్తం విషయాన్ని టీడీపీ నేతల ద్వారా తెప్పించుకున్న లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చారు.ఆ ఏడేళ్ల బిడ్డని తానే స్వయంగా దత్తత తీసుకోడానికి నిశ్చయించుకున్నారు. ఈ కార్యక్రమం జరపడానికి పిల్లవాడి బంధువులతో మాట్లాడుతున్నారు. శ్రేదేవి దంపతుల బిడ్డకి విద్య,వైద్య పరంగానే కాకుండా కుటుంబం లేని లోటు తెలియకుండా లోకేష్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పార్టీ వల్ల దెబ్బ తిన్న కుటుంబాన్ని ఆదుకోడానికి స్వయంగా ఓ బిడ్డని దత్తత తీసుకోవడం ద్వారా లోకేష్ మామ బాలయ్య స్టోరీలైన్ కి రివర్స్ లో వెళ్లి సాయం చేస్తున్నట్లుంది.