Posted [relativedate]
సాధారణంగా యువ నాయకుల రాకతో సీనియర్ నేతలు కొంత ఇబ్బంది పడుతుంటారు. జూనియర్లతో మాకు పోలికేంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కానీ టీడీపీలో మాత్రం అందుకు విరుద్ధంగా యంగ్ అండ్ సీనియర్ కాంబినేషన్ అదుర్స్ అనిపిస్తోంది. అదేనండి.. లోకేశ్- కళావెంకట్రావు జోడీ ఇప్పుడు ఏపీ రాజకీయాలనే శాసిస్తోంది.
అటు లోకేశ్, ఇటు కళా వెంకట్రావు ఇద్దరూ టీడీపీకి ఇప్పుడు చెరో చక్రంలా పనిచేస్తున్నారు. సైలెంట్ గా తమ పని కానిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నాయకులను సైకిల్ ఎక్కించడంలో ఈ జోడీయే కీ రోల్ పోషిస్తోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడంలో మంతనాలు జరిపింది వీరేనట. ఇలా జిల్లాల వారీగా ఈ జోడీ ఇప్పుడు పార్టీని పట్టాలెక్కిస్తోంది.
లోకేశ్, కళా వెంకట్రావు స్వతహాగా ఇద్దరూ మితభాషులే. అవసరమైతే తప్ప మీడియాతో పెద్దగా మాట్లాడరు. ఈ స్వభావమే వారిని పార్టీ నాయకులకు దగ్గర చేస్తోంది. ఎందుకంటే ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ఈ ఇద్దరూ మ్యానేజ్ చేస్తున్నారు. కార్యకర్తల సంక్షేమంపై లోకేశ్ దృష్టి పెడితే.. కళా వెంకట్రావు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. అందుకే ఈ జోడీపై చంద్రబాబు కూడా హ్యాపీగా ఉన్నారని టాక్.
లోకేశ్ పై పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఫ్యూచర్ లో ఆయన పెద్ద నాయకుడు కావాలన్నది టీడీపీ నేతల కోరిక. అందుకు తగ్గట్టుగానే కళా వెంకట్రావు నుంచి లోకేశ్ కు తగిన సలహాలు, సూచనలు అందుతున్నాయి. ఇలా ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. కాబట్టి ఇదే జోడీని చంద్రబాబు ఫ్యూచర్ లోనూ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల వరకు ఇక మార్పు ఉండబోదని సమాచారం. అటు పార్టీ నాయకులు కూడా హడావుడి చేసే నేతల కంటే.. ఇలాంటి జోడీయే బెటర్ అని కోరుకుంటున్నారు!!!