ఏపీ ఐటీ మినిస్ట‌ర్ గా నారా లోకేశ్?

0
531
nara lokesh as ap it minister

Posted [relativedate]

nara lokesh as ap it minister
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మినిస్ట‌ర్ కావ‌డం లాంఛ‌న‌మేనా? ఆయ‌న‌ను ఐటీ మినిస్ట‌ర్ గా నియమించ‌బోతున్నారా? అంటే ఔన‌నే అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు.

టీడీపీ కోసం నారా లోకేశ్ చేసిన సేవ‌ల దృష్ట్యా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని సీనియ‌ర్ నాయ‌కులు, క్యాడ‌ర్ చాలా కాలం నుంచి కోరుతున్నారు. ఆదిశ‌గా చంద్ర‌బాబు నాయుడుపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఆయ‌న మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఆ అంశాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చారు. అటు లోకేశ్ మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోకుండా పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటున్నారు. ఇటు కుమారుడికి మంత్రిప‌దవి ఇస్తే… విమ‌ర్శ‌లొస్తాయేమోన‌న్న ఆలోచ‌న‌తో ఇన్నాళ్లూ బాబు గారు కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే ఈసారి మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ ఖాయ‌మైపోవ‌డంతో… చంద్ర‌బాబు కూడా చివ‌ర‌కు పార్టీ నాయ‌కుల ఒత్తిడికి త‌లొగ్గ‌క త‌ప్ప‌లేదు. ఎట్ట‌కేల‌కు యువ‌నేత‌కు మినిస్ట్రీ ఇచ్చేందుకు ఆయ‌న ఒప్పుకున్నట్టు స‌మాచారం.

లోకేశ్ కు ఉన్న టాలెంట్ దృష్ట్యా ఆయ‌న‌కు ఐటీ లేదా మున్సిప‌ల్ శాఖ‌లు ఇవ్వాల‌నే యోచ‌న‌లో బాబు ఉన్నార‌ట‌. అయితే పార్టీ పెద్ద‌లు మాత్రం లోకేశ్ కు ఐటీ మినిస్ట్రీ ఇవ్వాల‌ని కోరార‌ట‌. ఎందుకంటే తెలంగాణ‌లో యువ‌నేతకు ఐటీ ప‌గ్గాలిస్తే… అక్క‌డ మంచి ఫ‌లితాలొచ్చాయి. ఏపీలో ఐటీ శాఖ‌ను లోకేశ్ కు ఇవ్వ‌డం ద్వారా ఐటీలో ఏపీ దూకుడు మ‌రింత పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక మినిస్ట్రీ కంటే ఆయ‌న‌ను ఎమ్మెల్సీని చేసేందుకు రంగం సిద్ద‌మైంది. ఎమ్మెల్యే కోటాలో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌నను గెలిపించి… మండ‌లికి పంపాల‌ని నిర్ణ‌యం జ‌రిగిపోయింద‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు టీడీపీ పొలిట్ బ్యూరో కూడా చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేసింద‌ట‌. ఇక లోకేశ్ ఎమ్మెల్సీ కావ‌డం… ఆ త‌ర్వాత ఐటీ మినిస్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టం లాంఛ‌న‌మేనంటున్నారు టీడీపీ నేత‌లు.

Leave a Reply