టీడీపీలో పార్ట్ టైమర్లకు స్థానం లేదన్న లోకేష్

0
477
nara lokesh comments on jr ntr,nara lokesh said here is no place to part time politicians

 

nara lokesh comments on jr ntr,nara lokesh said here is no place to part time politiciansతెలుగుదేశం పార్టీలో పార్ట్ టైమర్లకు స్థానం లేదనేశాడు.. నారా లోకేష్ బాబు. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు లోకేష్ ఈ వ్యాఖ్య చేయడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీతో జూనియర్ కు ఉన్న బంధం ఏమిటో కొత్తగా వివరించనక్కర్లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకుని తిరిగాడు తారక్. ఆ తర్వాత చాలా జరిగాయి. జనంలో ఇమేజ్ పెరిగిందని గ్రహించిన జూనియర్.. ఓ దశలో వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే అభిమానుల నిరసనతో వెనక్కుతగ్గారు.

ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ కు గేట్లు మూసేసినట్లే అనే ప్రచారం జరుగుతోంది. అంటే.. సినిమాలు చేసుకుంటున్న ఎన్టీఆర్ పార్టీకి అవసరం లేదు, వాటిని వదులుకుని వస్తే… రావొచ్చు.. అని పరోక్షంగా చెప్పాడు లోకష్. ఎలాగూ.. అది జరిగే పని కాదు కదా! సినిమాలు వదులుకుని పూర్తిగా రాజకీయాలవైపు వచ్చే దుస్సాహసాన్ని ఎన్టీఆర్ అస్సలు చేయలేడు, పార్ట్ టైమ్ గా మాత్రం ఛాన్సే లేదు అని లోకేష్ బాబు చెబుతున్నాడు. ఒకవేళ వచ్చినా.. ఎన్టీఆర్ కు ఏమీ పార్టీ బాద్యతలు అప్పగించరు కదా! పొలిట్ బ్యూరో స్థానం ఇస్తారంతే! దాని కోసం జూనియర్ తనకెరీర్ ను తాకట్టు పెట్టాలనేది లోకేష్ షరతు.

లోకేష్ చెప్పిన పార్ట్ టైమర్ సిద్ధాంతం ఇప్పటికీ టీడీపీలో కొనసాగుతోంది. ఓవైపు లోకేష్ మామ బాలకృష్ణ పార్ట్ టైమర్ గానే ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ కు మాత్రం అలా కుదరదంటున్నాడు లోకేష్. బాలయ్య పరిస్థితి ఏమిటి? ఒకవైపు సినిమాలు చేసుకొంటూ, మరోవైపు ఎమ్మెల్యేగా లేడా? బాలయ్య తీరుపై.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంపై హిందూపురం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం అవుతోందో ఎవరికీ తెలియంది? స్వయానా మామ అయిన బాలయ్య పార్ట్ టైమ్ చేస్తే ఓకే, అదే ఎన్టీఆర్ విషయంలో మాత్రం పార్ట్ టైమ్ కు అవకాశం లేదంటున్నాడు చినబాబు.

 

Leave a Reply