లోకేష్ కళ్ళు తెరిచాడు…

0
584
nara lokesh focus on social media

Posted [relativedate]

nara lokesh focus on social media
తెలుగు సోషల్ మీడియా లో వైసీపీ అధినేత జగన్ గుత్తాధిపత్యాన్ని ఇన్నాళ్లకు గుర్తించింది టీడీపీ.వాళ్లకి ఒక్క పేపర్ ఉంటే మాకు రెండున్నాయని,వాళ్లకి రెండు అనుకూల ఛానెల్స్ ఉంటే మాకు నాలుగున్నాయని తెలుగుతమ్ముళ్లు చంకలు గుద్దుకుంటున్నారు.ఈ టైం లో చాప కింద నీరులా జగన్ సోషల్ మీడియా అస్త్రాన్ని టీడీపీ,బాబు మీద ప్రయోగించారు.బాగానే సక్సెస్ అయ్యారు కూడా. వివిధ పేర్లతో నడుస్తున్న ఎన్నో వైసీపీ అనుకూల వెబ్ సైట్స్ కి జగన్ ఆర్ధిక అండదండలు అందిస్తున్నాడు.ఈ పని రెండేళ్ల కిందటే మొదలై ఇప్పుడు పతాక స్థాయికి చేరింది.దాని ప్రభావం ఏమిటో,అసలు సోషల్ మీడియా శక్తి ఏమిటో ఈ మధ్యే జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ కి బాగా అర్ధమైంది.అంతకు ముందు తెలుగు సోషల్ మీడియా లో టీడీపీ సర్కార్ కి వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేస్తోందని ఎంతో మంది ఎన్నోసార్లు హెచ్చరించినా అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు.చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితమో,ఇంకేమైనా జరిగిందో కానీ టీడీపీ యువనేత లోకేష్ కి విషయం చేరింది.జరుగుతున్న నష్టం అర్ధమైంది.

టీడీపీ సమన్వయ కమిటీ భేటీ లో పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్ సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావించారు.తెలుగు వెబ్ సైట్స్ లో దాదాపు 70 ,80 శాతం వైసీపీ కి అనుకూలంగా రన్ అవుతున్న విషయాన్ని కూడా లోకేష్ గుర్తించారు.వాటి ప్రచారం,సాగుతున్న నష్టాన్ని గురించి లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.సోషల్ మీడియా లో వైసీపీ ప్రేరేపిత,ప్రాయోజిత ప్రచారాన్ని నిరోధించకపోతే భారీ నష్టం తప్పదని పార్టీ శ్రేణులకు హెచ్చరికలు పంపారు.ఇకపై సోషల్ మీడియా,వెబ్ సైట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పార్టీ తరపున తీసుకుంటామని కూడా లోకేష్ హామీ ఇచ్చారు.అందులో భాగస్వాములు కావాలని పార్టీ లోని అన్ని విభాగాలను ఆదేశించారు.ఏమైతేనేమి ..లోకేష్ ఇప్పటికైనా కళ్ళు తెరిచాడు.

Leave a Reply