దసరాకి ఏపీ క్యాబినెట్ విస్తరణ..లోకేష్ ఇన్ ..కొత్త స్పీకర్?

0
603

  nara lokesh in ap cabinet change new speaker dhulipala narendra
దసరాకి కాస్త అటుఇటుగా క్యాబినెట్ విస్తరణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీ అవుతున్నారు.అందుకు అవసరమైన కసరత్తు కూడా చురుగ్గా సాగుతోంది.కొన్ని విషయాలు,కొందరి పదవులకి సంబంధించి సీఎం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టేనంటున్నారు.వాటిలో ఇప్పటికి అందుబాటులో వున్న సమాచారం ప్రకారం క్యాబినెట్ సభ్యుల సంఖ్య 20 నుంచి 26 కి పెరుగుతుంది. లోకేష్ మంత్రివర్గం లోకి రావడం ఖాయం.ఆయనకి ఐటీ తో పాటు మరో కీలక బాధ్యత అప్పగించే అవకాశముంది.

ఇక ప్రస్తుత స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ని క్యాబినెట్ లోకి తీసుకొని అయన స్థానం ధూళిపాళ్ల నరేంద్రకి అప్పగించవచ్చని తెలుస్తోంది.గంటా,శిద్దా,చినరాజప్ప శాఖల్లో మార్పులకి అవకాశముంది.ఇక వైసీపీ నుంచి వచ్చిన వారిలో భూమా ,జ్యోతుల తో పాటు సుజయ కృష్ణ కి క్యాబినెట్ స్థానం దక్కొచ్చని సమాచ్చారం.మరికొన్ని మార్పులు చేర్పులపై త్వరలో బాబు నిర్ణయం తీసుకుంటారు .

Leave a Reply