వాళ్ళ ఉత్సాహం మీద లోకేష్ నీళ్లు..

 Posted October 25, 2016

nara lokesh reject minister post tdp leaders shocked
ఏపీ లో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా..ఎప్పుడు క్యాబినెట్ లోకి వెళ్లి కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వాళ్లకి యువనేత లోకేష్ ఊహించని షాక్ ఇచ్చాడు.యూపీ పరిణామాలని ఉదహరిస్తూ నాకు మంత్రి పదవి వద్దని లోకేష్ గుంటూరు పార్టీ సమావేశంలో చెప్పడంతో క్యాబినెట్ ఔత్సాహికులు ఉలిక్కిపడ్డారు.లోకేష్ మంత్రిపదవి కాదంటే విస్తరణ ఆలస్యమవుతుందేమోనని వారి భయం.విస్తరణకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు లింక్ పెడితే అదో అదనపు భారం అవుతుందని…ముప్ఫైమూడో రోజుకి ఏమవుతుందో ఏమో అన్నది వారి ఆందోళన.అందుకే ఓ ఎమ్మెల్సీ నేతృత్వంలో కొందరు లోకేష్ ని కలవబోతున్నారు.మంత్రివర్గంలో చేరమని ఆయన్ని ఒత్తిడి చేస్తారని తెలుస్తోంది.అది ఫలిస్తే స్వామికార్యం..స్వకార్యం పూర్తి అవుతుందని ఆశ కాబోలు.

SHARE