Posted [relativedate]
విదేశీ అమ్మాయిలతో లోకేష్ ఉన్న ఫోటోలు సాక్షి సహా టీడీపీ వ్యతిరేకులకు అస్త్రంగా మారుతున్నాయి.లోకేష్ గురించి ఏ అంశం ప్రస్తావనకు వచ్చినా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు దర్శనమివ్వడం పరిపాటి అయిపోయింది.నిజంగా లోకేష్ ఇలా ఉంటాడా అని అందరిలో సందేహం.అదే విషయాన్ని ఓ విద్యార్థి నేరుగా లోకేష్ ని అడిగేశాడు.అనంతపురం,Pvkk ఇంజనీరింగ్ కళాశాల ఇందుకు వేదికైంది.ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత పాత్ర అనే అంశంపై విద్యార్థులతో లోకేష్ ముఖాముఖీ నిర్వహిస్తున్నప్పుడు ఓ విద్యార్థి …మీరు ఫారిన్ గర్ల్స్ తో తిరిగారంటగా అని అడిగాడు.
ఊహించని ఈ ప్రశ్నకు లోకేష్ జవాబిచ్చాడు.స్టాన్ ఫర్డ్ నుంచి వచ్చిన మిత్రులతో కలిసి 2006 లో దేశమంతా తిరిగామని …అప్పుడు సరదాగా ఫ్రెండ్స్ తో వందలకొద్దీ ఫోటోలు దిగామని ,అందులో ఓ మూడు ఫోటోలు పట్టుకుని సాక్షి రాద్ధాంతం చేస్తోందని లోకేష్ వివరణ ఇచ్చాడు.కుర్రోళ్ళు ఫోటోలు దిగడం వాటిని సోషల్ మీడియాలో పెట్టడాన్ని కూడా రాజకీయం చేస్తారా అని లోకేష్ అన్నారు.ఈ విధంగా ఎప్పటినుంచో ఉన్న విదేశీ అమ్మాయిల ఎపిసోడ్ గుట్టు ని లోకేష్ విప్పేసాడు.