జగన్ కి లోకేష్ థాంక్స్ ..

0
449

Posted [relativedate]

 nara lokesh thanks jagan
హోమ్ మంత్రి చినరాజప్పని లోకేష్ అవమానించాడంటూ చేసిన హంగామాతో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది.అంతకన్నా ఇన్నాళ్లుగా ఎంత ప్రయత్నించినా రాని ఇమేజ్ లోకేష్ కి వచ్చేలా చేసిన ఘనత కూడా ఆ పార్టీకే దక్కింది.చంద్రబాబు చెంత మర్రి చెట్టు కింద చిన్న మొక్కలా ఎదగడానికి లోకేష్ పడిన పాట్లు అన్ని ఇన్ని కావు.పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ ప్రసంగాలు చేయడంలో బలహీనత తోనేతలకు,కార్యకర్తలకు చేరువ అయినట్టుగా సామాన్య జనానికి లోకేష్ దగ్గర కాలేకపోయారు.అసలు లోకేష్ వ్యవహార శైలి ఇలా ఉంటుందని ఇప్పటిదాకా కచ్చితమైన బ్రాండ్ కూడా పడలేదు.ఈ అంశాన్నే అవకాశంగా తీసుకుని లోకేష్ మీద అహంకారి అన్న ముద్ర వేద్దామని వైసీపీ ట్రై చేసింది.కొంతవరకు సక్సెస్ అయినా ఘటన జరిగిన రోజు వీడియో తీయడంతో లోకేష్ బయటపడ్డారు.

పైగా ఆ వీడియోలో నేతలంతా లోకేష్ తో చనువుగా మాట్లాడ్డం..అయన అందర్నీ అన్నా అని పిలవడం జనమంతా చూశారు.ఓ నెగటివ్ ఫీలింగ్ తో వీడియో మొదలెట్టి పాజిటివ్ నోట్ తో లోకేష్ ని అంచనా వేశారు.ఆ పాజిటివ్ బజ్ కోసం ఎంత ప్రయత్నించినా ఇన్నాళ్లు లోకేష్ వల్ల కాలేదు.ఇప్పుడు అనుకోకుండా రాజకీయ బద్ధశత్రువే ఆ పని చేసాడు.ఈ ఎపిసోడ్ చూస్తుంటే సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పిన ఓ కొటేషన్ గుర్తొస్తోంది.’నువ్వు రాళ్లు వేస్తే వాటితో చుట్టూ గోడ కట్టుకుంటా’ అని శ్రీను వైట్ల తో గొడవప్పుడు ప్రకాష్ చెప్పిన ఈ మాట లోకేష్ విషయంలో అక్షర సత్యమైంది.వేసిన అస్త్రమే తిరిగొచ్చి జగన్ కి షాక్ తగిలింది.రెండుమూడు రోజుల పరిణామాలు చూస్తే ఇంత సాయం చేసిన జగన్ కి లోకేష్ కనీసం మనసులో అయినా థాంక్స్ చెప్పుకునే ఉంటాడు.

Leave a Reply