బాలీవుడ్ లోకి నారా  రోహిత్??

 Posted [relativedate]

nara rohit act in bollywood remake of appatlo okadundevadu movieహిట్టూ.. ఫ్లాఫ్ అన్న ధ్యాస లేకుండా, జనాదరణకు  నోచుకోకపోయినా డిఫరెంట్ సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు నారా రోహిత్. డజనుకు  పైగా సినిమాలు  చేసినా వాటిల్లో హిట్టైనవి రెండే సినిమాలు. జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు రోహిత్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఈ సినిమాలో  పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ నారా వారి అబ్బాయి   విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ మోజు పడింది. డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ లోకి రీమేక్ చేయనున్నారట.

రియలిస్టిక్  సినిమాలకు ఆదరణ పెరిగిన నేపధ్యంలో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాని హిందీలో పునఃనిర్మించాలని  ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్ణయించుకుందట. ఈ రీమేక్ లో కూడా నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడని సమాచారం. ఈ మేరకు నిర్మాతలు రోహిత్ తో సంప్రదింపులు కూడా జరిపారట. రోహిత్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంటే మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడన్నమాట. కాగా పలు స్టార్  హీరోలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. మరి టాలీవుడ్ లోనే సరిగా సక్సెస్ కాలేకపోయిన నారా రోహిత్ బాలీవుడ్ లో ఎలా రాణిస్తాడో చూడాలి.  

Leave a Reply