Posted [relativedate]
సినిమా హిట్టైనా ఫ్లాప్ అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా వైవిద్యసినిమాలను మాత్రమే చేసే ఏకైక హీరో నారా రోహిత్. తెరంగేట్రం చేసిన బాణం సినిమా నుండి మొన్నటి అప్పట్లో ఒకడుండేవాడు సినిమా వరకు అతని సినీ ప్రయాణం చాలా డిఫరెంట్ గా సాగింది. ఇంకా చెప్పాలంటే నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన కధలో రాజకుమారి సినిమా ఫస్ట్ లుక్ లో కూడా అతని రోల్ చాలా డిఫరెంట్ అనే తెలుస్తోంది. ఇప్పటివరకు వైవిధ్యమైన సినిమాలు చేసినా ఈ సినిమాలో మాత్రం పంచె కట్టి, గెడ్డం పెంచి, కత్తి పుచ్చుకొని.. వీర మాస్ గా కనిపించాడు రోహిత్.
కాగా ఈ మాస్ లుక్ లో కనిపించడం వెనక ఉన్న సీక్రెట్ బయటపడింది. కథలో రాజకుమారి సినిమా నేపధ్యంలో సాగే ఓ గేమ్. ఇందులో అతను విలన్ గా నటించనున్నాడట. ఆ ఆటని, హీరోయిన్ ని ఇద్దర్ని ప్రేమిస్తాడట విలన్. చివరికి ఏమైందో తెలియాలంటే కధలో రాజకుమారి రావాల్సిందే. ఏమైనా కధ డిఫరెంటే, రోహిత్ గెటప్ కూడా డిఫరెంటే కదండీ.