ఇది నిజం అయ్యే ఛాన్స్‌ లేనే లేదు

0
516
Nara Rohit does not have a chances of acting niharika

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Nara Rohit does not have a chances of acting niharika
మెగా ఫ్యామిలీ నుండి సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు అయిన నిహారిక దాదాపు రెండు సంవత్సరాల క్రితం ‘ఒక మనస్సు’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా నిహారికకు మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నిహారికకు అవకాశాలు వచ్చాయి. ఆ మద్య తమిళ సినీ పరిశ్రమ నుండి కూడా నిహారికకు ఛాన్స్‌లు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు నిహారిక రెండవ సినిమాకు సంబంధించిన కమిట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఈ సమయంలోనే నిహారిక రెండవ సినిమా ఫిక్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

నారా రోహిత్‌, పవన్‌ సాదినేనిల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సావిత్రి’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా సక్సెస్‌ నేపథ్యంలో వారిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమాకు రంగం సిద్దం అవుతుంది. ఇటీవలే నారా రోహిత్‌ కూడా ఆ విషయాన్ని అధికారికంగా దృవీకరించాడు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నిహారికను ఎంపిక చేసే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. నిహారికకు భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాలో ఆమెతో హీరోయిన్‌గా నటింపజేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ అంతా కూడా అవాక్కవుతున్నారు. నారా హీరోతో నిహారిక సినిమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయమై మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారు సదరు వార్తలను కొట్టి పారేస్తున్నారు. నిహారిక రెండవ సినిమా ఆలోచన ఇప్పట్లో చేయదని, ఆమె ప్రస్తుతం సినిమాపై దృష్టి పెట్టడం లేదని, నారా రోహిత్‌తో ఆమె నటించనుంది అనే విషయంలో వాస్తవం లేదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు. సినీ వర్గాల వారు కూడా నారా రోహిత్‌తో నిహారిక నటించే ఛాన్స్‌ లేనే లేదు అంటున్నారు.

Leave a Reply