తన బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టిన నారా రోహిత్

 Posted October 21, 2016

nara rohit said about background

‘బాణం’తో తెలుగు తెరపైకి దూసుకొచ్చాడు నారా రోహిత్. ‘సోలో’తో ఓ హిట్ కొట్టాడు.ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా హిట్ మాత్రం దక్కలేదు. ఈ మధ్యే ‘జ్యోఅచ్చుతానంద’తో మెప్పించాడు. అయితే, ప్రయోగాల పేరుతో పెద్దగా పేరులేని నిర్మాతల చిత్రాల్లో నటిస్తే.. అవి విడుదల కాక ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.’శంకర్’ కూడా ఇలాంటి చిత్రమే. దీంతో..రోహిత్ తన కెరియర్ పై తానే ప్రమోగాలు చేసుకుంటున్నాడు అంటూ ఫిలింనగర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదీగాక, నారా వారి బ్యాక్ గ్రౌండ్ ఉంది హిట్ సినిమాలు అవసరామా.. ? సటైర్స్ వేస్తున్నారు.

తాజాగా, శంకర్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నారా రోహిత్ తన బ్యాక్ గ్రౌండ్ పై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభావం వల్ల తనకు వరస పెట్టి సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి అన్న రూమర్స్ పై గట్టిగా సమాధానమిచ్చారు. ‘ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ ఒక్క వ్యక్తిని నాతో సినిమా చేయమని అడగలేదు, ఇక ముందు కూడా అడగను. బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని ఉంటే పెద్ద పెద్ద సినిమాల్లో నటించే వాడిని కదా’ అన్నారు రోహిత్.

ఇదిలావుండగా..షూటింగ్ ఎప్పుడో పూర్తయి ఆర్థిక కారణాల వల్ల మూలన మూలిగిన ‘శంకర’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.’శంకర’సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా .. నారా రోహిత్ నటనకి మాతం మంచి మార్కులే పడ్డాయి.

SHARE