ఇద్దరి మధ్య మ్యాటర్ చెడిండా..!

0
296

Posted [relativedate]

నారా రోహిత్, నాగశౌర్య కలిసి నటించిన జ్యో అచ్యుతానంద మంచి విజయం దక్కించుకుంది. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అంచనాలను అందుకుంది. అయితే ఆ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా నటించి మెప్పించిన రోహిత్, నాగ శౌర్యలు ఇప్పుడు మరోసారి సినిమాలో కనిపించబోతున్నారు. మహేష్ డైరెక్ట్ చేస్తున్న కథలో రాజకుమారి సినిమాలో నారా రోహిత్ హీరో. ఓ స్పెషల్ క్యారక్టర్ లో నాగ శౌర్య కనబడుతున్నాడట. అంతేనా ఇద్దరి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తుంది.

సో జ్యో అచ్యుతానంద మూవీలో బ్రదర్స్ లా కనిపించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరంటే ఒకరు పడని విధంగా కనిపించనున్నారన్నమాట. మరి ఇద్దరి మధ్య అసలు మ్యాటర్ ఎందుకు చెడింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఇదే కాకుండా మంచి లక్ష్మి కూడా ఈ సినిమాలో నిర్మాతగా కనిపించనున్నారట. సోలో హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రోహిత్ ఈసారి నాగ శౌర్య సహకారంతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి.

Leave a Reply