నరసింహన్ ను సాగనంపుతారా?

0
420
narasimham is going to leave

Posted [relativedate]

narasimham is going to leaveగవర్నర్ నరసింహన్ అంటే ఢిల్లీ పెద్దలకు ఇష్టం లేదా? కాంగ్రెస్ హయాంలో అపాయింట్ అయిన ఆయనను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారా ? తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త గవర్నర్ రాబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

తాజాగా కేంద్రప్రభుత్వం తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సాక్షిగా ఢిల్లీ పెద్దల ఆలోచన బయటపడింది. ప్రధాని మోడీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రోగ్రామ్ స్టేజీపై ప్రధాని, గవర్నర్ ఇద్దరూ రెండువైపులా కూర్చున్నారు. గవర్నర్ పలుసార్లు ప్రధానితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ప్రధానిని పలకరించారు కూడా. కానీ గవర్నర్ పిలిచిన ప్రతీసారి మోడీ అటూ ఇటు ముఖం తిప్పుతూ కనిపించారు. కావాలని చేశారో.. లేదో కానీ.. మొత్తానికి గవర్నర్ పలకరించిన ప్రతీసారి మోడీ ముభావంగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఒకింత షాక్ కు గురయ్యారు.

ప్రధాని మోడీతో గవర్నర్ మాట్లాడేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సభికుల కంటపడ్డాయి. అసలు గవర్నర్ ను ఎందుకు మోడీ పలకరించలేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ అంటే ఇష్టం లేకనే ఇలా చేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నరసింహన్ పై వేటు పడుతుందని భావించారు. ఎందుకనో అలా జరగలేదు. తెలంగాణ, ఏపీ గాడిన పడే దాకా వేచిచూద్దామని భావించినట్టున్నారు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పరిపాలన గాడిన పడడం.. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కేంద్రానికి ఫుల్ సపోర్టు చేస్తుండడంతో…ఇదే మంచి తరుణమని కేంద్రం భావిస్తోందట. అయితే ఈసారి తెలంగాణ, ఏపీకి వేర్వేరుగా గవర్నర్లు వస్తారా.. ? ఉమ్మడి రాష్ట్రాలకు ఒకే గవర్నర్ వస్తారా? అన్నది క్లారిటీ లేదు.

Leave a Reply