వివేకా,నారాయణ..మధ్య ఓ డ్రామా

0
275
narayana and anam brothers politics in nellore district

Posted [relativedate]

narayana and anam brothers politics in nellore district
రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.ఇక రాజకీయ నేతల జీవితాల్లో అంతకు మించిన నాటకీయత ఉంటుంది.ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది.నెల్లూరు జిల్లాలో బండ్లు ఓడలయ్యాయి..ఓడలు బండ్లయ్యాయి.అదెలాగో చూద్దాం..
నెల్లూరు జిల్లా రాజకీయాల ప్రస్తావన ఎప్పుడు ..ఎక్కడ వచ్చినా ముందుగా వినిపించేది ఆనం కుటుంబం గురించే.ఇక ఆనం బ్రదర్స్ గా పేరు పడ్డ ఆనం వివేకానంద రెడ్డి,ఆనం రామనారాయణ రెడ్డి దాదాపు 20 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఏ పార్టీ అధికారంలో వున్నా, తాము ఏ పార్టీ లో వున్నా ఆనం బ్రదర్స్ తమదైన మార్క్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ ఇద్దరిలో కూడా నెల్లూరు లో వివేకానంద రెడ్డి మాటే శాసనంగా సాగిన రోజులున్నాయి.ఇలా ఆనం వివేకా జిల్లాని రాజకీయంగా ఏలే రోజుల్లో నారాయణ కేవలం ఓ రెసిడెన్షియల్ కాలేజ్ అధిపతి.ఆ క్రమంలో ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వ శాఖల నుంచి ఆ కాలేజీ కి ఇబ్బందులు వచ్చినప్పుడు నారాయణ ఈ ఆనం బ్రదర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు.ఒక్కోసారి పనయ్యేది.ఒక్కోసారి పని జరిగేదికాదు. ఒక్కోసారి అవమానాలు కూడా జరిగేవి.ఈ తరహా ఘటనలు వివేకా,నారాయణ మధ్య ఎక్కువట.

కాలం మారింది.ఒకప్పుడు కేవలం ఓ విద్యాసంస్థ అధిపతి నారాయణ రాష్ట్ర మంత్రి.సీఎం చంద్రబాబు అంతరంగికుల్లో ఒకరు.ఇప్పుడు వివేకా ఎమ్మెల్యే కూడా కాదు.నెల్లూరు లో బాగా పేరున్న వీఆర్ కాలేజీ కి ఈ మధ్య దాకా కరెస్పాండంట్.హై కోర్ట్ తీర్పుతో కాలేజ్ కమిటీ ఎన్నిక చెల్లదని తేలింది. ఆ కాలేజ్ మీద 20 ఏళ్లుగా పట్టు సాగిస్తున్న వివేకా కి ఇది ఊహించని షాక్.ఈ కాలేజ్ విషయంలో ఒకప్పుడు వివేకాకు వ్యతిరేకంగా టీడీపీ నేతలే పోరాటం చేశారు.కాలేజ్ మీద పట్టు కోల్పోడాన్ని తట్టుకోలేక వివేకా అదే విషయంలో నారాయణ ఇంటికెళ్ళారు.దీనవదనంతో వీఆర్ కాలేజ్ అంశంలో సాయం చేయమని నారాయణని కోరారు.టీడీపీ శ్రేణులు వద్దన్నా ఈ విషయంలో ఏదో ఒక సాయం చేద్దామని నారాయణ మాటిచ్చేదాకా వివేకా అక్కడనుంచి కదల్లేదట.

వివేకా అక్కడనుంచి వెళ్ళాక ఒకప్పుడు కాలేజీ విషయంలో తాను వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాలు,అవమానాల గురించి సన్నిహితులతో చెప్పారంట.అయినా అదేమీ మనసులో పెట్టుకోకుండా సాయం చేస్తున్నట్టు చెప్పారట.ఈ విషయం నుంచి వివేకా ఏ పాఠం నేర్చుకోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కానీ ఇదే విషయంలో నీతిబోధ చేసిన నారాయణ కూడా ఓ పాఠం నేర్చుకోవాలి.ఆనం కుటుంబ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణ సాయం చేయడానికి ముందుకొచ్చారు.కానీ సీఎం తో సాన్నిహిత్యం ఉందన్న నమ్మకంతో నెల్లూరు జిల్లాలో మరెందరో నాయకుల్ని నారాయణ చిన్న చూపు చూస్తున్నారట.ఈ పద్ధతి మారకపోతే ఈరోజు వివేకాకు ఎదురైన అనుభవమే రేపు నారాయణకు ఎదురు కావొచ్చు.మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఎంతో నాటకీయత ..సినిమాల్ని మించిన డ్రామా వుంది .ఎప్పుడు ఎవరు ఏమి అవుతారో ఎలా చెప్పగలం? బండ్లు ఓడలవుతాయి..ఓడలు బండ్లవుతాయి.తస్మాత్ జాగ్రత్త.

Leave a Reply