గురువుని ముంచిన శిష్యుడు…

0
588
narayana minister post may be lost because of vemireddy pattabhi rami reddy

 Posted [relativedate]

narayana minister post may be lost because of vemireddy pattabhi rami reddy
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కుడిభుజంలా వ్యవహరిస్తూ వచ్చిన నారాయణకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదని వస్తున్న వార్తలు టీడీపీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. నారాయణకు ఈ పరిస్థితి వస్తుందని నెల్లూరు జిల్లా తమ్ముళ్లు ఊహించనే లేదట.ఆయనంటే పడని దేశం నేతలు,ఆయన వల్ల రాజకీయంగా వెనకబడిన నేతలు సైతం ఈ పరిణామం గురించి అంచనా వేయడం అటుంచి ఆశించే ధైర్యం కూడా చేయలేకపోయారు.అయితే తాజా పరిస్థితికి కారణం ఏంటా అని ఆరా తీస్తే గురువుని ముంచిన శిష్యుడని తేలిందట.ఇంతకీ గురువుని ముంచిన ఆ శిష్యుడు ఇంకెవరో కాదు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి.

వేమిరెడ్డి బ్రదర్స్ మీద వున్న చెడ్డ పేరు నెల్లూరు జిల్లా ప్రజలకి తెలుసు.నారాయణ కాలేజీ నిర్వహణలో వుంటూ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో లెక్క లేకుండా మాట్లాడతారని ఎప్పటినుంచో వారికి పేరుంది.ఇక వాళ్ళ దూకుడుకి తట్టుకోలేక ఎంతోమంది లెక్చరర్స్,ప్రొఫెసర్స్ నారాయణలో ఉద్యోగం వదులుకుని వెళ్లారు.ఇక అక్కడ చదువుకున్న పిల్లలకి సైతం పట్టాభి మీద సదభిప్రాయం లేదు.ఇవన్నీ తెలిసి కూడా నారాయణ పట్టాభిని అభ్యర్థిగా ఎంచుకుని,హై కమాండ్ వద్ద తనకున్న పలుకుబడితో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు.తాను పట్టాభిని గెలిపించుకుని వస్తానని బాబుకి హామీ ఇచ్చారట.అయితే దీంతో పాటు నారాయణ ఇన్ ఛార్జ్ గా వున్న చిత్తూరు జిల్లా ఫలితం కూడా రివర్స్ కావడంతో నారాయణ రాజకీయం మీద నెల్లూరు నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులకి బలం పెరిగింది.ఎన్నికలు,రాజకీయ అనుభవం లేని ఈయన్ని మంత్రిగా కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్పదని అర్ధం చేసుకున్న బాబు ..నారాయణకు క్యాబినెట్ నుంచి పంపేందుకు రెడీ అయ్యారట. ఏమైనా నెల్లూరు ప్రజలు ఇప్పుడు గురువుని ముంచిన శిష్యుడు గురించి చెప్పుకుంటున్నారు.

Leave a Reply