ప్రధాని ఏపీ టూర్ షెడ్యూల్ ఇదే…

0
585
narendra modi ap tour schedule
Posted [relativedate]
narendra modi ap tour scheduleప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం తిరుపతికి వస్తున్నారు. ఐదు రోజులపాటు జరగనున్న ఇస్కా సదస్సులను ఆయన ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
 • ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు. విమానంలోనే బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు.
 • 10.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
 • 10.30 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి తిరుపతిలోని వ్యవసాయ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.
 • 10.55 గంటలకు తారకరామా స్టేడియం వద్దకు చేరుకుని.. అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే ప్రదర్శనలను తిలకిస్తారు.
 • 11గంటలకు 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్ సదస్సును ప్రారంభిస్తారు. తొలుత ఇస్కా జనరల్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ డి.నారాయణరావు స్వాగతోపన్యాసం చేస్తారు.
 • ఆ తర్వాత కేంద్రమంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రసంగం ఉంటుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సును ఉద్దేశించి 10 నిమిషాలపాటు ప్రసంగిస్తారు.
 • 11.30 గంటలకు ప్లీనరీ సెషన్లను పీఎం ప్రారంభించి, ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేస్తారు. నోబెల్‌ బహుమతి గ్రహీతలను కూడా సన్మానిస్తారు. ఉత్తమ శాస్త్ర పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలకు ప్రత్యేక బహుమతులను అందజేస్తారు.
 • 11.50 నుంచి 12.24 గంటల వరకు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రధానికి నారాయణరావు జ్ఞాపికను అందజేస్తారు. ఎస్వీయూ వీసీ దామోదరం కృతజ్ఞతలు తెలుపుతారు.
 • ఆ తర్వాత పీఎం మధ్యాహ్నం 12.27 గంటలకు బయల్దేరి గ్రీన్‌ రూమ్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
 • ఒంటి గంటకు కారులో బయల్దేరి 1.45 గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ 10 నిమిషాలు పాటు విశ్రాంతి తీసుకుంటారు.
 • మధ్యాహ్నం 1.55కు బయల్దేరి శ్రీవారిని దర్శించుకుంటారు.
 • 2.50 గంటలకు తిరుమల నుంచి కారులో బయల్దేరి 3.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
 • 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి వెళతారు.

Leave a Reply