Friday, May 27, 2022
Homelatestట్రంప్ ను కలిసే ముహూర్తం ఫిక్స్

ట్రంప్ ను కలిసే ముహూర్తం ఫిక్స్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అధ్యక్షుడు అయిన దగ్గర్నుంచీ ఓవైపు భారత్ ప్రధాని మోడీని పొగుడుతూ.. మరోవైపు అమెరికాలో ఇండియన్స్ ను ముప్పుతిప్పలు పెడుతున్న ట్రంప్.. ఆసక్తికర భేటీ కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. మోడీకి స్వాగతం అంటూ బిల్డప్ బాగానే ఇస్తున్నారు. కానీ వీసా విధానం మార్పుతో భారతీయులు ఇబ్బందులు ఎదుర్కుంటున్న తరుణంలో.. ఈ ఇద్దరు నేతల భేటీ ఏం తేల్చనుందనేది ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ భారత్ కు మిత్రుడేనని కేంద్రం చెబుతోంది. అవును భారత్ కంటే మిత్రదేశం మరేదీ లేదని వైట్ హౌస్ బల్లగుద్ది మరీ చెబుతోంది. మరి అలాంటప్పుడు ఇండియన్స్ ను వీసా రూల్స్ నుంచి ఎందుకు మినహాయించడం లేదంటే.. ఆ ఒక్కటి అడగొద్దని తప్పించుకుంటున్నారు ట్రంప్ అధికారులు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలిసారి అమెరికా వెళ్తున్న మోడీతో ట్రంప్ వ్యవహారశైలి ఎలా ఉండబోతున్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు మోడీని కలిసి ట్రంప్ విధానాలు , భారతీయులపై పడే ప్రభావం గురించి నివేదికలు ఇచ్చారు. మరి ఈ అంశాలు అక్కడ ప్రస్తావిస్తారా.. అమెరికా టూర్లో మోడీ కుదుర్చుకునే కొత్త ఒప్పందాలేంటనేది అన్నీ ఆసక్తకిరమే. ఇక ఎన్నారైలతో మీటింగ్ ఉండనే ఉంది. మోడీ కోసం ట్రంప్ కంటే ఎన్నారైలు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు.

- Advertisment -
spot_img

Most Popular