నాగార్జున గదిలో ఆమె..!

Posted November 30, 2016, 10:25 am

Image result for nagarjuna and tamannaకింగ్ నాగార్జున రాజు గారి గది-2 లో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో నాగార్జున చేస్తున్నాడని తెలియగానే సూపర్ క్రేజ్ వచ్చిన రాజు గారి గది-2 ఇప్పుడు పెద్ద సినిమా అయ్యింది. ఓంకార్ డైరక్షన్లో వచ్చిన రాజు గారి గది సూపర్ హిట్ అయ్యింది. అయితే అదే తరహా కథతో ఈసారి సినిమాలో నాగార్జున కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. నాగ్ కెరియర్ లో చేస్తున్న మొదటి హర్రర్ మూవీగా రాజు గారి గది-2 స్పెషాలిటీ తెచ్చుకుంది.

ఇక సినిమాలో హీరోయిన్ గా సీరత్ కపూర్ నటిస్తుండగా నాగార్జునకు జోడిగా మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా ఓకే అయ్యిందట. బాహుబలి అవంతిక పాత్రలో సూపర్ పాపులారిటీ సంపాదించిన తమన్నా ఈ సినిమాలో భాగస్వామ్యం అవడం విశేషం. ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా వస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా పివిపి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో రోల్ చిన్నదే అయినా కథలో కీలకంగా ఉన్న పాత్ర కాబట్టి నాగ్ సినిమా రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నట్టు టాక్. రాజు గారి గది-2 తో మరో ప్రయోగం చేస్తున్న నాగార్జున సినిమా ఫలితం ఎలాంటి జోష్ ఇస్తుందో చూడాలి.