నరుడా డోనరుడా రివ్యూ…

 Posted November 4, 2016

naruda donaruda movie reviewచిత్రం : నరుడా డోనరుడా (2016)
నటీనటులు :  సుమంత్‌, పల్లవి సుభాష్‌
సంగీతం : శ్రీచరణ్‌ పాకాల
దర్శకత్వం : మల్లిక్‌ రామ్‌
నిర్మాత: సుప్రియ, జాన్‌సుధీర్‌ పూదోట
రిలీజ్ డేట్ : 04నవంబర్, 2016.

పదిహేడేళ్ల కెరీర్.. పాతిక సినిమాలు. ఇది హీరో సుమంత్ గ్రాఫ్. దాదాపు రెండు సంత్సరాల తర్వాత బోల్డ్ కాన్సెప్ట్ తో ‘న‌రుడా డోన‌రుడా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుమంత్. వీర్య దానం కాన్సెప్ట్ ని బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించారు. అక్కడ ‘విక్కీడొనర్’ విక్టరీని నమోదు చేసింది. కానీ.. తెలుగులో ఈ కాన్సెప్ట్ తో సినిమా అంటే సాహసమే. నిజంగా సుమంత్ సాహసమే  చేశాడు. ఆ సాహసం ఏలావుందో అనే ఆసక్తిని ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల్లో కలిగేలా చేయడంలో డోనరుడు సక్సెస్ అయ్యాడు కూడా. ట్రైలర్, టీజర్స్ లో డైలాగ్స్ పేలాయ్. దీంతో.. రిలీజ్ కి ముందే డోనరుడిపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. పాజిటివ్ టాక్ మధ్య డోనరుడు ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరీ.. డోనరుడిలో మేటరు ఉందా.. ? బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకొన్న ఈ బోల్డ్ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకి ఏ మేరకు నచ్చింది.. ? ఇంతకీ నరుడా.. డోనరుడా.. అసలు కథేంటీ.. ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
విక్ర‌మ్ అలియాస్ విక్కీ (సుమంత్) ఓ మధ్య తరగతి యువకుడు. క్రికెటర్. చదువు పూర్తయిన ఉద్యోగం లేదు. విక్కీ చిన్నప్పుడే తండ్రి కార్గిల్ యుద్దంలో మర్ణిస్తాడు. అమ్మ(శ్రీలక్ష్మి).. నాయనమ్మలతో విక్కీ హ్యాపీగా గడిపేస్తుంటాడు. ఉద్యోగం లేకున్నా మనోడు ప్రేమ పాఠాలు మాత్రం మొదలెట్టేస్తాడు. ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్‌ (పల్లవి సుభాష్‌) అనే బెంగాలీ అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్నాళ్లు వెంటపడిన తర్వాత ఆషియా కూడా విక్కీ ప్రేమలో పడిపోతుంది. అయితే, ఆషియాకి ముందే పెళ్లై విడాకులు కూడా తీసుకొంది. ఆ విషయాన్ని విక్కీకి ముందే చెబుతోంది ఆషిమా.

విక్కీ మాత్రం ఓ తన గురించి ఓ రహస్యాన్ని దాచిపెట్టి ఆషిమాని పెళ్లాడతాడు. విక్కీ.. ఓ స్పెర్మ్‌ డోనర్‌. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) బలవంతం చేయడంతో తన వీర్యాన్ని దానం చేయడానికి ఒప్పుకొంటాడు. చాలా సింపుల్ గా ఖర్చులకి డబ్బులు అందుతుండటంతో ఆ పనిని పెళ్లైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంటాడు. ఓ సందర్భంలో ఈ నిజం అషిమాకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏమైంది.. ? వీళ్ల వైవాహిక జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయ్.. ?? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* డైలాగ్స్
* కామెడీ
* సుమంత్‌, తనికెళ్ల భరణి

నెగిటివ్ :
* డైరెక్షన్
* స్క్రీన్ ప్లే
*  హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
బాలీవుడ్ ‘విక్కీ డొనర్’ సినిమా చూసిన వాళ్లకి సుమంత్ డోనరుడా పెద్దగా నచ్చకపోవచ్చు.అయితే, ఆ చిత్రం చూడనివారికి మాత్రం డోనరుడు కొత్తగా కనిపిస్తాడు.ఈ తరహా పాత్ర చేయడం సుమంత్‌కి ఇదే తొలిసారి. చురుగ్గానే నటించాడు. అయితే, హీరో-హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ కంటే..సుమంత్ ఆంజనేయులు (తనికెళ్ల భరణి) మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.డైలాగ్స్, కొన్ని తమాషా పదాలని వాడారు ఇందులో.‘విత్తనం’అనే మాటను చాలా రకాలుగా..చాలాసార్లు వాడారు.ఇది ప్రేక్షకుడిని ఆకట్టుకొంది. హీరోయిన్ ఫర్వాలేదనిపించింది.దర్శకుడు మల్లిక్‌ రామ్‌ ఏమాత్రం సాహసం చేయలేదు.విక్కీడొనర్ ని మక్కీకి మక్కీ దించేందుకు ట్రై చేశాడు.అందులో కొంత వరకు సక్సెస్ అయ్యాడు కూడా.ఇక, మిగితా నటీనుటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.

సాంకేంతికంగా :
వీర్య దానం కాన్సెప్ట్. ఈ బోల్డ్ కానెప్ట్ తో.. కడుపుబ్బ నవ్వించే స్క్రిప్ట్ ని రాసుకోవచ్చు. యూట్ ని హీటెక్కించే సన్నివేశాలని చూపించొచ్చు. అయితే, ఈ రెండింటిలో దేనిని సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. ఎంతసేపు ‘విక్కీడోనర్’లో ఉన్నది ఉన్నట్టు దింపేందుకు శ్రమించినట్టు కనబడింది. అది.. తెలుగు ప్రేక్షకులకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ కథని మారుతి లాంటి దర్శకుడు డీల్ చేస్తే.. ఆ రేంజ్ మరోలా ఉండేది. శ్రీచరన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సాదాసీదాగానే ఉన్నాయి. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఎడిటింగ్ ఓకే. తెరపై సినిమా చూడ్డానికి కాస్లీగానే ఉంది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
బాలీవుడ్ చిత్రం ‘విక్కీ డొనర్ ‘ చూడని వారికి ‘నరుడా డోనరుడా’ కొద్దిలో కొద్దిగా ఓకే అనిపించొచ్చు. ‘విక్కీ డొనర్’ చూసిన వారికీ మాత్రం సుమంత్ డోనరుడా ఏ మాత్రం నచ్చకపోవచ్చు. బోల్డ్ కాన్సెప్ట్ ని అమితంగా ఇష్టపడే వారు డోనరుడిని ఓ సారి చూడొచ్చు. మిగితా ప్రేక్షకులు డొనరుడికి దూరంగా ఉండటమే మంచింది.

బాటమ్ లైన్ : ‘నరుడా డోనరుడా’.. సుమంత్ ‘వీర్యం’లో మేటరు లేదు..

SHARE