దెబ్బకి దిగొస్తున్న పాక్..దోవల్ కి ఫోన్

Posted October 3, 2016

nasser khan janjua phone ajit dovalసర్జికల్ స్ట్రైక్స్ తరువాత ఎదురైనా ఘోర పరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న పాక్ ..అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కాస్త డిఫెన్స్ లో పడింది.సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి మెట్టు దిగి వస్తోంది.సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహరచన చేసిన జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ కి పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జంజువా ఫోన్ చేశారు.సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై ఆ ఇద్దరు చర్చించారు.ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇద్దరు ఓ అంగీకారానికి వచ్చారు.పైగా ఈ అంశాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ బయట ప్రపంచానికి వెల్లడించడం విశేషం.

SHARE