నాని కోసం ఇంత సాఫ్ట్ టైటిలేంటి రాజు..?

0
187
nataraju title for nani next project

Posted [relativedate]

nataraju title for nani next project
సినిమాకి హీరోహీరోయిన్ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం. ఈ మధ్య కాలంలో టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్మాతలు. కథకు సంబధం లేని టైటిల్స్ కాకుండా జనాలకు ఈజీగా రిజిస్టర్ అయ్యే విధంగా టైటిల్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు.

అందునా మరి కొంతమంది దర్శకనిర్మాతలు తమ సినిమాలకి ముందుగానే టైటిల్స్ ఫిక్స్ చేసి, ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంటారు. ఈ విధంగా సినిమా మొదలుపెట్టకముందే దాదాపు టైటిల్ ని ఫిక్స్ చేసే నిర్మాతల్లో దిల్ రాజు ముందుంటాడు.

రీసెంట్ గా వచ్చిన నేను లోకల్, సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి, ప్రస్తుతం బన్నీతో హరీష్ శంకర్ డైరెక్షన్ లో తీస్తున్న డీజే… ఈ సినిమాలన్నీ టైటిల్ ఎనౌన్స్ చేసిన తర్వాత మొదలుపెట్టినవే. అయితే ఇవన్నీ సినిమా కధని బట్టి హీరోల ఇమేజ్ ని బట్టి సెలెక్ట్ చేసిన టైటిల్స్. కానీ ఇప్పుడు దిల్ రాజు… నానీతో చేయబోయే సినిమాకు సెలెక్ట్ చేసిన టైటిల్ వింటుంటే మాత్రం కాస్త ఆశ్యర్యం కలగక తప్పదు.

ఎంతో ముందు చూపుతో టైటిల్స్ ఫిక్స్ చేసే ఈ నిర్మాత ఇప్పుడు నటరాజు అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు. ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని హీరోగా రూపొందే చిత్రం కోసం ఈ టైటిల్ ని దిల్ రాజు సెలెక్ట్ చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే నాని లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి నటరాజు వంటి సాఫ్ట్ అండ్ క్లాసికల్ టైటిల్ ఏంటో అని గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలతో డిఫరెంట్ టైటిల్స్ తో వస్తున్న నాని నిజంగానే నటరాజులా కన్పించనున్నాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.

Leave a Reply