ఆ కలాల్లో పసుపు పచ్చ ఇంక్…

Posted January 23, 2017

national active reporters associations celebrated nara lokesh birthday
ఔను …మీరు చదివింది నిజమే..ఆ కలాల్లో పసుపు పచ్చ ఇంకు కక్కుతోంది.ఇదెక్కడో ఏ శాస్త్రవేత్తో చేసిన ఘన కార్యం కాదు.శ్రీకాకుళం జిల్లాలో కొందరు జర్నలిస్టులు చేసిన మహా కార్యం .ఒకప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ప్రైవేట్ పార్టీకి పిలిస్తే వెళ్ళడానికే జర్నలిస్టులు జంకేవారు.ఒకవేళ వెళ్లినా తమ గౌరవ మర్యాదలకి ఏ మాత్రం భంగం కలక్కుండా వ్యవహరించేవారు.కాలం మారింది.ఆ తర్వాత జర్నలిస్టులు,రాజకీయ నేతలు కలిసిమెలిసి వ్యవహరించే రోజులూ వచ్చాయి.కాలం ఇంకాస్త ముందుకెళ్లింది.ఎందాక అంటే… ఓ రాజకీయ నేత బర్త్ డే వేడుకల్ని విలేకరులు స్వయంగా నిర్వహించేంత.ఇంకా నమ్మబుద్ది కావడం లేదా? కానీ పై ఫోటో చూశాక నమ్మక తప్పుతుందా?

శ్రీకాకుళం జిల్లాలో నారా ఆధ్వర్యంలో యువ నేత,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఇక్కడ నారా(Nara ) అంటే …నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్.ఇందులో జిల్లాకి సంబంధించిన ఎందరో జర్నలిస్ట్ నేతలున్నా…లోకేష్ బర్త్ డే వేడుకల సెలబ్రేషన్ భలే జరిగిపోయింది.ఏమి చేస్తాం? ఇది కలికాలం …కాదుకాదు కలంకాలం..ఇప్పుడైనా నమ్ముతారా ఆ కలాల్లో పసుపు పచ్చ ఇంక్ కక్కుతోందని..

SHARE