పాక్ లో దోవల్ ఓ సారి ఎవరికి దొరికాడంటే?

Posted October 1, 2016

national security advisor ajit dovalఇప్పటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అప్పట్లో పాకిస్తాన్ లోగూఢచర్యం చేస్తున్న రోజులవి.అయన ఓ బిచ్చగాడిగా,ముస్లిం గా బతుకుతున్న రోజులు.ఓ సారి నమాజ్ కి వెళ్లి వస్తుంటే..ఓ ముస్లిం పెద్దాయన దోవల్ వైపు అనుమానంగా చూశాడు.పక్కకి తప్పుకుందామనుకున్నా వదల్లేదు.ఓ చోటుకి పిలిచి నేరుగా నువ్వు ముస్లిం కాదు కదా అని అడిగేశాడు.తేరుకునేలోపే నువ్వు హిందువు కదా అని మరో అస్త్రం సంధించాడు.అదేమీ లేదని దోవల్ సమాధానం చెప్పినా పట్టించుకోకుండా అక్కడనుంచి అతన్ని దగ్గరలోని ఓ ఇరుకు ఇంటికి తీసుకెళ్లాడు.దోవల్ చూస్తుండగానే ఓ పెట్టె లోపలనుంచి హిందూ దేవతా చిత్రాలు తీశాడు.షాకులు మీద షాకులు తగులుతున్నా ఐబీ శిక్షణ వల్ల దోవల్ బయటపడలేదుగానీ ..ఆ పెద్దాయన మనసు విప్పి గుండెలో భారం తీర్చుకునే ప్రయత్నం చేశాడు.ఆ పెద్దాయన మాటలతో దోవల్ కి ఇంకో షాక్ .ఆ పెద్దాయన కూడా హిందువే.ఈ కారణం తోటే ఆయన కుటుంబ సభ్యుల్ని మతచాందసులు చంపేశారు.ఆయనొక్కడే తప్పించుకుని ఇలా మారు వేషంలో ప్రాణాలు కాపాడుకుంటున్నారు.

ఇదంతా విన్నాక దోవల్ గుండె భారమైంది.అయినా తన విషయం ఈయనకు ఎలా అర్థమైందా అని ఆలోచిస్తుండగానే ..పెద్దాయన ఓ సలహా ఇచ్చాడు.ఆ చెవిపోగు రంధ్రం కనపడకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో అని చెప్పాడు.పెద్దాయనకి తన గురించి ఎలా తెలిసిపోయిందో దోవల్ కి అర్ధమైంది.హిందువుల్లోవుండే చెవి పోగు కుట్టించే సాంప్రదాయం గుర్తొచ్చింది.ఇక ముందు అది కనపడకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసింది.ఇన్ని కష్టాల్లోనూ అంత చిన్న విషయాన్ని కనిపెట్టిన పెద్దాయన సునిశిత దృష్టిని లోలోన మెచ్చుకుంటూ బయటికి ఏమీ తెలియనట్టు అక్కడనుంచి బయటపడ్డారు దోవల్.ఎంతైనా దేశ రక్షణ భాధ్యతల్ని వృత్తిగా కాకుండా జీవితంగా భావించినవాడు కదా.

SHARE