జాతీయ గీతానికి ఆ గౌరవం ఇవ్వాల్సిందే …

85

Posted November 30, 2016, 5:32 pm

Image result for supreme court

జాతీయ గీతాన్ని దేశవ్యాప్తంగా గౌరవించాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. అన్ని సినిమా థియేటర్లలోనూ సినిమా ప్రదర్శన ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని వినిపించాలని తీర్పు చెప్పింది. ఆ సమయంలో తెరపై జాతీయ జెండాను ప్రదర్శించాలని తెలిపింది సంపూర్ణంగా జాతీయ గీతాన్ని వినిపించాలని, ఎటువంటి నాటకీయతలకు చోటు ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది. జాతీయ గీతం వినిపిస్తున్నపుడు ప్రేక్షకులంతా లేచి, నిల్చుని గౌరవాన్ని ప్రదర్శించాలని వివరించింది. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిందిఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే.

భోపాల్ కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. 1960లో ఈ విధానాన్ని అమలు చేసేవి సినిమా థియేటర్లు. 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని సుప్రీమ్ ఈ ఆర్డర్స్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here