జనసేన బాటలో సిద్ధూ ..

  navjot singh sidhu start new party just like pawan kalyan
ఆవాజ్ ఏ పంజాబ్ పేరుతో పార్టీ ప్రకటించి అటు బీజేపీ ఇటు ఆప్ కి షాక్ ఇచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ జనసేన దారిలో నడవబోతున్నాడు.ఎన్నికల ముందు పార్టీ పెట్టి ప్రజల్లో అయోమయం సృష్టించడం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చాడు సిద్ధూ.అందుకే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అయన బహిరంగ ప్రకటన చేసేశాడు.

2014 ఎన్నికల ముందు జనసేన ఏర్పాటు చేసిన పవన్ …టీడీపీ ,బీజేపీ కూటమికి మద్దతు వరకే పరిమితమయ్యారు.ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగలేదు. ఇప్పుడు సిద్ధూ సైతం అదే ఆలోచన చేస్తున్నా అయన పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.పార్టీ ఏర్పాటుకి ముందు బీజేపీ కి రాజీనామా చేసిన సిద్ధూ ఆ పార్టీపై విమర్శలు కూడా ఎక్కుపెట్టారు.ఆప్ లోకి చేరడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.మళ్లీ కొత్త ఏర్పాటులో ఆప్ నేతలకి పెద్ద పీట వేసాడు.ఈ పరిస్థితుల్లో పంజాబ్ ఎన్నికల్లో సిద్ధూ మద్దతు ఎవరికి దక్కుతుందో చూడాలి.

SHARE