Posted [relativedate]
రేటింగ్ : 2/5
దర్శకత్వం : గోవర్ధన్ రెడ్డి
నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి
బ్యానర్ : గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్
సంగీతం : రఘు కుంచె, సాయికార్తీక్
రొటీన్ కు భిన్నం గా గ్లామర్ క్వీన్ త్రిష నటించిన ద్విభాష చిత్రం నాయకి.పద్ధతిగా పట్టుచీర కట్టుకుని వరుస హత్యలు చేస్తూ వెళుతున్నట్టుగా వచ్చిన పోస్టర్స్, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో త్రిష దెయ్యంగా కనిపించనుందని అంటున్నారు.మరో వైపు గ్లామర్ ని మొతాదుకు మించి చూపించింది అంటున్నారు. గోవి దర్శకత్వంలో, గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గిరిధర్ నిర్మించిన నాయకి ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది.మరి నాయకిగా త్రిష భయపెట్టిందా రెచ్చ గొట్టిందా తెలుసుకుందాం
చిత్ర కథ
కొందరు వ్యక్తులు హైద్రాబాద్‌కు దగ్గర్లోని దుండిగల్ అనే ప్రాంతంలో వరుసగా అదృశ్యమవుతూ ఉంటారు. కొనెళ్లుగా ఆ ప్రాంతంలోని ఓ బంగ్లా పరిసరాల్లో కొందరు వ్యక్తులు మాయం అవుతూ ఉండడంతో, ప్రభుత్వం కూడా అటువైపుగా ఎవ్వరినీ వెళ్ళవద్దని హెచ్చరిస్తుంది. ఈ నేపధ్యం లో సంజయ్ (సత్యం రాజేష్) అనే ఓ సినీ దర్శకుడు, తనకు స్నేహితురాలైన సంధ్య (సుష్మా రాజ్) అనే ఓ అమ్మాయిని తీసుకొని, స్నేహితుడి గెస్ట్ హౌస్‌కు బయలుదేరతాడు. ఆ దారిలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, సంజయ్, సుష్మాలు దుండిగల్‌లోని దయ్యాల బంగ్లాకు వెళ్ళి అక్కడ చిక్కుకుంటారు. ఆ బంగ్లాలో గాయత్రి (త్రిష) అనే ఓ దయ్యం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తన బంగ్లాకు వచ్చే వారందరినీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ, చంపేస్తూ ఉంటుంది. ఈ కోవలో సంజయ్ కూడా గాయత్రి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాడు. అసలు గాయత్రి ఎవ్వరు? ఆమె అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఆ ఇంట్లో ఏం ఉంది?గాయత్రి గతం ఏంటి? అందర్నీ చంపినట్లుగానే గాయత్రి సంజయ్‌ని కూడా చంపేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెండి తెర పైనే చూడాలి.
నటీనటుల ప్రతిభ
నటీనటుల ప్రతిభ గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా త్రిష గురించి చెప్పుకోవాలి.సినిమాలో త్రిష నటన మెయిన్ హైలెట్ అని చెప్పాలి.. చాలా బాగా నటించింది. త్రిష నటనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. సత్యం రాజేష్ చేసే కామెడీ మరో హైలైట్‌గా చెప్పుకోవాలి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అతడి నటన కూడా బాగా ఆకట్టుకుంది.ఇక సుష్మారాజ్ ఓ అమాయకురాలైన పాత్రలో బాగా నటించింది. జయప్రకాష్ తన స్థాయికి తగ్గ నటన చూపించాడు.
సాంకేతికవర్గం పనితీరు
రోటిన్ దయ్యం కధలాగే ఈ సినిమా కూడ వుండటం కధనం బాగున్న ఆడియన్స్ కనెక్ట్ అయ్యే రీతిలో దర్శకుడు సినిమాను మలచలేకపోవటం పెద్ద మైనస్. ఒక కొత్త కథాంశాన్నే ఎంచుకున్న గోవీ అది చూపించటం లో మాత్రం విఫలం అయ్యాడు.సీన్స్ చాలా రోటిన్ గా అనిపించాయి.క్లైమాక్స్ కాని ఫ్లాష్ బ్యాక్ స్టోరి గాని అస్సలు ఆకట్టుకునే విధంగా లేవు.కాకపోతే మేకింగ్ పరంగా తన ప్రతిభను బాగా చూపించాడు.కెమెరా పనితనం బాగుంది. ఓ బంగ్లా చుట్టూనే తిరిగే కథకు కావాల్సిన మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి బాగా క్యారీ చేశాడు.రఘ కుంచే మ్యూజిక్ సో సో గానే వుంది. సాయికార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు.నిర్మాణ విలువలు ఆర్ట్ వర్క్ బాగుంది.
మంచి
త్రిష నటన
కధనం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఫస్ట్ హాఫ్ కామిడి
చెడు
కధ
రొటీన్ సీన్స్
క్లైమాక్స్
ఫ్లాష్ బ్యాక్ సీన్స్
చిత్ర విశ్లేషణ
పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేకుండ ఓ రెండు గంటలపాటు కామిడితో కూడుకున్న హారర్ ని ఎంజాయ్ చేయ్యాలని అనుకుంటే ఓ సారి ఈ వీక్ ఎండ్ లో ప్రయత్నించవచ్చు.నాయకి పెద్దగా భయపెట్టకపోయనా ఆకట్టుకుంటుంది.ట్రై వన్స్
*గీత తల్లాప్రగడ