పెళ్ళి తంతు ముగించేసిందా..!

Posted November 17, 2016

Nayanatara Married Director Vighnesh Sivanసౌత్ సూపర్ హీరోయిన్స్ లో అటు కమర్షియల్ సినిమాలకే కాదు ఫీమేల్ లీడ్ రోల్స్ కు తన ప్రత్యేకతను చాటుకున్న హీరోయిన్ నయనతార గురించి ఓ హాట్ న్యూస్ కోలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది. కెరియర్ మొదలు పెట్టిన నాటి నుండి శింభు, ప్రభుదేవ, తాజాగా విఘ్నేష్ శివన్ లతో ప్రేమ వ్యవహారాలు నడిపిన ఈ చిన్నది గత నెల మేలోనే దర్శకుడు ప్రస్తుత లవర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుందని అంటున్నారు.

ఇదో రకంగా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ అయినా నయన్ ఇలా చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటా అని ఆరా తీస్తున్నారు. అయితే ఈ డౌట్ రాడానికి ముఖ్య కారణం అవార్డ్ ఫంక్షన్ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా తన ప్రియుడిని వెంట తెచ్చుకోవడమే. ఈ క్రమంలో ఇలా కలిసి మెలిసి ఉండటం కొత్తగా పెళ్లయిన జంటే చేస్తుందని నిర్ధారించేశారు. ఇంకా ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు ప్రేక్షకులను మభ్యపెడుతూ వారు మాత్రం కలిసి కాపురం చేసేస్తున్నారని కోలీవుడ్ మీడియా రచ్చ చేస్తుంది. మరి ఈ విషయం ఓ క్లారిటీ రావలంటే నయనతార అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేసేదాకా ఆగాల్సిందే.

SHARE