4 కాదు 7 కోట్లంటున్న నయనతార..!

0
295
Nayanatara Remuneration Shock For Kollywood Producers

Posted [relativedate]

Nayanatara Remuneration Shock For Kollywood Producersసౌత్ సినిమాల్లో హీరోయిన్ గా ఇప్పటికే నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతార సూపర్ క్రేజ్ సంపాదించింది. ఈ క్రమంలో అమ్మడికి అడిగిననత ఇచ్చి మరి సినిమాలు చేయించుకుంటున్నారు. సినిమా సినిమాకు తన లోని ఆశ పెంచేసుకుంటున్న నయన్ ఇప్పుడు పారితోషికం మరింత పెంచాలని చూస్తుందట. నిన్న మొన్నటిదాకా 4 కోట్లు అన్న నయనతార ఇప్పుడు తనతో సినిమా తీయాలంటే 7 కోట్లు కావాల్సిందే అని పట్టు పడుతుందట.

ఏంటి ఒక్క హీరోయిన్ కే 7 కోట్లా అని షాక్ అవడం ఖాయం. సౌత్ లో ముఖ్యంగా తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఇక అందులోనూ నయనతార నటించిన సినిమాలంటే ప్రత్యేకంగా ఉంటాయి. ఫ్యాన్స్ ను అలాంటి సినిమాలతో కూడా అలరించే నయనతార నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని రెమ్యునరేషన్ ను భారీగా పెంచేస్తుంది నయనతార.

మరి దాదాపు ఓ స్టార్ హీరో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార చేస్తున్న సినిమాలన్ని హిట్ అవుతున్నాయన్న ఆలోచనతో పారితోషికం పెంచేయడం బాగానే ఉంది కానీ క్రేజ్ ఉన్నప్పుడు ఇలా భారీ మొత్తం అందుకుని ఒకేసారి కెరియర్ గ్రాఫ్ తగ్గాక మళ్లీ తక్కువకు చేయాలని ఆలోచన చేస్తే మంచిది. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సలహా ఇస్తున్నారు.

Leave a Reply