Posted [relativedate]
కొత్త పంచాంగంలో తెలంగాణకు బాగానే ఉందని పండితులు చెప్పుకొచ్చారు. అన్నీ బాగానే ఉన్నా హోం డిపార్ట్ మెంటుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లో కలవరం మొదలైందని టాక్.
ఉగాది నాడు పంచాంగ శ్రవణం కాగానే సీఎం కేసీఆర్ .. అదే వేదికపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కొత్త పంచాంగం ప్రకారం చూస్తే… జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎందుకంటే ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతారు. అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య జాగ్రత్తగా ఉండాలని వేదపండితులు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పట్లో ఆయనకు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కారణాలేవైనా కొన్ని నెలల తర్వాత అదే నిజమైంది. రాజయ్య పదవి ఊస్ట్ అయ్యింది.
పంచాంగ శ్రవణం నేపథ్యంలో కొంపదీసి ఈసారి తన పదవికి ఎసరు వస్తుందా? అని సన్నిహితులతో నాయిని చర్చిస్తున్నారట. తాను కూడా రాజయ్య లాగా మాజీమంత్రిగా మిగిలిపోకుండా.. ఇప్పట్నుంచే అలర్ట్ గా ఉండాలని డిసైడయ్యారట. అందుకే ఇక నుంచి స్ట్రిక్ట్ గా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట. ఈ పంచాంగ శ్రవణం నిజమవుతుందా? పదవీగండం నుంచి నాయిని బయటపడతారా? అన్నది చూడాలి.