Monday, May 23, 2022
Homelatestనాయిని మాట తడబడింది

నాయిని మాట తడబడింది

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి టంగ్ స్లిప్పైంది. మరో పదేళ్ల పాటు కేసీఆరే సీఎంగా ఉంటారని కరెక్టుగా చెప్పిన నాయిని ఆ తర్వాతే పప్పులో కాలేశారు. టీడీపీయే అధికారంలో ఉంటుందని చెప్పి నాలిక్కరుచుకున్నారు. కేసీఆర్ ఇంకా టీడీపీలో ఉన్నారనుకున్నారా.. లేదంటే లోపల ఉన్న విషయం బయటికొచ్చేసిందా అని తెలుగు తమ్ముళ్లు తెగ జోకులేసుకుంటున్నారట.

నాయిని నర్సింహారెడ్డికి ఇలా నోరు జారడం కొత్తేం కాదు లేండి. గతంలో కూడా పోలీసుల ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ఇలాంటి పొల్లుమాటలు చాలా మాట్లాడారు. అసలు ఆయన పేరుకే హోం మంత్రి కానీ.. అంతా కేసీఆర్ చూసుకుంటారనే విషయం బహిరంగ రహస్యమే. ఏదో పెద్దాయన కాబట్టి కీలక పోస్టు పేరుకు ఇచ్చారని గుసగుసలు వినిపిస్తాయి. కాస్త పొరపాటైతే ఇంత రాద్ధాంతం చేయాలా అంటున్న నాయిని ఫ్యాన్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి.

రాజకీయాల్లో పొరపాట్లకు తావు లేదు. ఒక్కసారి నోరు జారితే సరిదిద్దుకోవడం కష్టం. ఇప్పటికే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అవినీతి పేరుతో కేసీఆర్ ను ఇబ్బందిపెడుతున్నారు. ఇలాంటి సమయంలో నాయిని కోరి కర్ర అందించారని గులాబీ క్యాడర్ వాపోతోంది. కేసీఆర్ నాయినిని లైట్ తీసుకున్నా.. టీడీపీ నేతలు మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎలాగైనా నాయిని మాటలు నిజం చేయాలని చూస్తున్నారు.

- Advertisment -
spot_img

Most Popular