Posted [relativedate]
ఆడదాని వయసు మగవాడి సంపాదన అడగకూడదన్నది పాత నానుడి.ఈ విషయంలో గ్లామర్ ఫీల్డ్ లో వుండే హీరోయిన్స్ ఇంకెంత జాగ్రత్తగా వుంటారో వేరే చెప్పాలా? కానీ గుట్టుగా దాచుకునే ఆ వయసు వివరాల్ని బయటపెట్టింది ఓ కుర్ర హీరోయిన్.ఏదో విషయం మాట్లాడబోయి ఇంకేదో రహస్యం బయటపెట్టి త్రిష,నయనతారలకి కోపం తెప్పించింది హన్సిక.తమిళ తెరపై 6 ,7 ఏళ్లుగా తెగ వెలిగిపోయిన హన్సికకి ఇటీవల అవకాశాలు తగ్గాయి.చేతిలో సినిమాలు లేకపోవడంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలేమైనా చేస్తారా అని అడిగాడు ఓ జర్నలిస్ట్.అంతే అమ్మడు రెచ్చిపోయింది.అలాంటి సినిమాలు చేయడానికి నా వయసెంత? 25 ఏ కదా..అయినా అలాంటి సినిమాలు చేసేది 30 దాటినవాళ్ళే ..నాకింకా అలాంటి సినిమాలు చేయడానికి ఎంతో టైం వుంది అని గడగడా మాట్లాడేసింది హన్సిక.
హన్సిక మాటలు ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి.ఇప్పటికే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న త్రిష,నయనతారకి మంటెక్కింది.ఆమెకి అవకాశాలు తగ్గితే మా గురించి ఎత్తి చూపడమేంటని ఆ ఇద్దరూ హన్సిక మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.యధాలాపంగా మాట్లాడిన మాటలు ఇందాకా వస్తాయని ఊహించని హన్సిక ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలో తెలియక తెగ హైరానా పడిపోతుంది.