Posted [relativedate]
జాతక ప్రభావం అన్న మాటలో నిజముందో లేదో గానీ నయనతారకి ప్రేమ,పెళ్లి పెద్దగా అచ్చి వచ్చినట్టు లేదు.అందుకే శింబు,ప్రభు దేవా లతో లవ్ ఫెయిల్యూర్ తర్వాత నయనతార కొన్నాళ్ల పాటు అసలు ఇక ఆ జోలికే వెళ్లొద్దు అనుకుంది.కానీ మళ్లీ ప్రేమ పురుగు కుట్టేసింది.దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.అయితే ఇంతకు ముందు వ్యవహారాల్లో లాగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా జాగ్రత్త పడింది.అయితే ఈ రిలేషన్ అక్కడితో ఆగకుండా పెళ్లి దాకా వెళ్లిందని ఓ టాక్.అయితే ఆ విషయాన్ని కూడా ఇటు నయన కానీ అటు విఘ్నేష్ కానీ నిర్ధారించలేదు.కానీ తాజాగా వచ్చిన దోర సినిమా ప్లాప్ కావడంతో ఇక కెరీర్ కి బ్రేక్ ఇచ్చి సంసార సాగరం ఈదుదామని శివన్ ప్రపోజల్ తెచ్చాడంట.కానీ ఇప్పుడిప్పుడే కెరీర్ కి బ్రేక్ ఇచ్చే ఆలోచన లేదని నయన జవాబు ఇవ్వడంతో శివన్ హర్ట్ అయ్యాడంట.
పెళ్లి విషయాన్ని మీడియా సహా అందరి ముందు దాచడం ఇక నా వల్ల కాదని,ఆ విషయం బయటికి చెప్పి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాల్సిందేనని విఘ్నేష్ పట్టుబట్టడంతో నయన కూడా ఫైర్ అయ్యిందట.ఈ గొడవ పెద్దగానే జరిగి చివరకు ఈ జంట ఓ నిర్ణయానికి వచ్చిందట.అదేమిటంటే …ఇంకో రెండేళ్ల పాటు నయన సినిమాల్లో యాక్ట్ చేయాలని..ఆపై కొత్త జీవితం స్టార్ట్ చేయాలని. మొత్తానికి తమ గుట్టు విప్పాలని తొందరపడ్డ ప్రియుడిని నయన బాగానే దారికి తెచ్చుకుందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.