Posted [relativedate]
కేరళ కుట్టి నయనతార ఇప్పుడు ఫుల్ స్వింగులో ఉంది. ప్రస్తుతం సౌత్ లో అందరి కంటే టాప్ హీరోయిన్ అని చెబుతున్నారు. అందరికంటే ఎక్కువ రేటు కూడా ఆమెదేనట. అలాంటి నయన్ ఇప్పుడు సినిమాలు ఎక్కువైపోయే సరికి కండిషన్లు పెట్టేస్తోంది. అవి కూడా మామూలు కండిషన్లు కాదు..వాటన్నింటికీ ఒప్పుకుంటేనే గానీ సినిమా చేసే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఇంతకీ నయన్ పెట్టిన కండిషన్లేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.
సినిమా స్టోరీతో పాటు సీన్ బై సీన్ తన పాత్ర గురించి నయన్ కు ముందే చెప్పాలట. అలాగే మెయిన్ సీన్లలో డైలాగులను ముందే చెప్పాలట. ఎట్టి పరిస్థితుల్లో లిప్ లాక్ సీన్… బాత్రూత్ సన్నివేశాలు… రొమాంటిక్ సీన్స్ ఉండకూడదట. మొత్తం 6 కండిషన్ల చిట్టా దర్శకనిర్మాతలకు ఇచ్చిందట నయన్. ఇప్పుడు తాను చేయబోతున్న ఇరుముగన్ సినిమానుంచే ఈ కండిషన్లు వర్తించనున్నాయని టాక్. ఈ 6 కండిషన్ల లిస్టు చూసి ఇరుముగన్ దర్శకనిర్మాతలు ఒక్కసారిగా షాకైపోయారట.
ఇరుముగన్ దర్శక నిర్మాతల సంగతేమో కానీ… నయన్ మరీ ఓవర్ చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి సీన్లు లేకుండా ఇప్పుడు సినిమాలు ఉంటాయా… అని గుసగుసలాడుతున్నారు సినీజనాలు. ఈ కండిషన్లపై వెనక్కు తగ్గకపోతే అమ్మడుకు సినిమాలు రావడం కష్టమేనంటున్నారు. డిమాండ్ ఉంది కదా అని పిచ్చి కండిషన్లు పెడితే… ఆఫర్లు వేరే వాళ్లు తన్నుకుపోతారని సినీ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. మరి నయన్ కు ఈ విషయం అర్థమవుతుందో.. లేదో!!